News


అమెజాన్‌ నుంచి ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!

Friday 17th January 2020
Markets_main1579257014.png-30997

  •   అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌

న్యూఢిల్లీ: ప్రపంచ ఆన్‌లైన్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ శుక్రవారం ఒక కీలక ప్రకటన చేసింది. 2025 నాటికి భారత్‌తో 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు  వెల్లడించింది. ‘‘మీ వ్యాపారంలో వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నారని’’ అమెజాన్‌ ను ఉద్దేశించి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌ గురువారం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో..  అమెజాన్‌ సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో జెఫ్‌ బెజోస్‌ శుక్రవారం మాట్లాడుతూ..వచ్చే ఐదేళ్లలో అమెజాన్‌ ఇండియాలో పదిలక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. కొత్తగా సృష్టించే ఉద్యోగాలన్నీ పరిశ్రమల్లోనేగాక, ఐటీ, స్కీల్‌ డెవలప్‌మెంట్‌, కంటెంట్‌ క్రియేషన్‌, రీటైల్‌, లాజిస్టిక్స్‌, మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ రంగాల్లో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. గత ఆరేళ్లుగా అమెజాన్‌ ఇండియాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా 7 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని, ఇప్పుడు కల్పించబోయే 10 లక్షలు అదనమని బెజోస్‌ పేర్కొన్నారు. భారత్‌లో పర్యటిస్తున్న బెజోస్‌..భారత్‌ అభివృద్ధికి ఎంతో అవకాశమున్న ప్రధానమైన మార్కెట్‌ అని, 21వ శతాబ్దం భారత్‌దేనన్నారు. అంతేకాకుండా భారత్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్‌ చేసేందుకు 1 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.7వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ‘‘అమెరికాకు చెందిన కంపెనీలు మనదేశంలో ,పెట్టుబడులు పెట్టడం ద్వారా మనకు ఒరిగింది ఏమిలేదని ఆయా కంపెనీల లాభాలపైనే దృష్టిపెడుతున్నాయని విమర్శించారు. దీంతో బెజోస్‌ శుక్రవారం పై విధంగా స్పందించారు. 



You may be interested

స్వల్పంగా పెరిగిన టీసీఎస్‌ నికరలాభం

Friday 17th January 2020

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ నికరలాభం స్వల్పంగా పెరిగింది. 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 0.20 శాతం నామమాత్ర పెరుగుదలతో రూ. 8,105 కోట్ల నుంచి రూ. 8,118 కోట్లకు చేరింది. విశ్లేషకులు రూ. 8,180 కోట్ల మేర అంచనాలు వెల్లడించగా, ఈ అంచనాలను టీసీఎస్‌ దాదాపు అందుకుంది. కంపెనీ ఆదాయం 6.7 శాతం వృద్ధితో రూ. 37,338

అటూఇటుగా ముగిసిన మార్కెట్లు

Friday 17th January 2020

స్వల్ప లాభాంతో సెన్సెక్స్‌ నిఫ్టీకి నామమాత్ర నష్టం 3 వారాల గరిష్టానికి ఆర్‌ఐఎల్‌ భారతీ ఎయిర్‌టెల్‌ దూకుడు ఏజీఆర్‌ బకాయిలపై టెలికం రంగం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి అటూఇటుగా ముగిశాయి. ఆద్యంతం స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 13 పాయింట్లు బలపడి 41,945 పద్ద నిలవగా.. నిఫ్టీ 3 పాయింట్ల నామమాత్ర నష్టంతో 12,352 వద్ద స్థిరపడింది.

Most from this category