News


హైదరాబాద్‌లో అమెజాన్‌ భారీ డెలివరీ స్టేషన్‌

Thursday 20th June 2019
news_main1561017238.png-26446

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అతిపెద్ద డెలివరీ స్టేషన్‌ను బుధవారం హైదరాబాద్‌లో  ప్రారంభించింది. 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలో నెలకొల్పిన ఈ కేంద్రం ద్వారా రంగారెడ్డి జిల్లాలోని కస్టమర్లకు వేగంగా ఉత్పత్తులను డెలివరీ చేయడానికి వీలవుతుందని కంపెనీ తెలిపింది. తెలంగాణలో మొత్తం 90 డెలివరీ స్టేషన్లున్నాయని, వీటిలో ఒక్క హైదరాబాద్‌లో 12 విస్తరించాయని అమెజాన్‌ ఇండియా లాస్ట్‌ మైల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌ రోచ్‌లానీ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 32 లక్షల చదరపు అడుగుల విస్తర్ణంలో మూడు ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు, లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు సార్ట్‌ సెంటర్లు భాగ్యనగరిలో ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. కిరాణా స్టోర్ల వంటి 2,500 వరకు ‘ఐ హావ్‌ స్పేస్‌’ డెలివరీ/పికప్‌ కేంద్రాలు విస్తరించాయని పేర్కొన్నారు. తెలంగాణలో 17,000 మంది సెల్లర్లున్నారని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 



You may be interested

పీఎన్‌బీ మొండిబకాయిల వసూళ్లు రెట్టింపు

Thursday 20th June 2019

బ్యాంక్ వార్షిక నివేదిక న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మొండిబకాయిల (ఎన్‌పీఏ) రికవరీ 2018-19 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపయ్యింది. ఈ మొత్తం రూ.20,000 కోట్లు. 2017-18తో పోల్చితే (రూ.9,666 కోట్లు) ఈ మొత్తం దాదాపు రెట్టింపు. బ్యాంక్‌ వార్షిక నివేదికలో చైర్మన్‌ సునిల్‌ మెహతా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆభరణాల వర్తకులు నీరవ్‌మోదీ, చోక్సీ కొందరు ఉద్యోగులు కుమ్మక్కై చేసిన దాదాపు రూ.11,000 కోట్ల కుంభకోణం 2018 ఫిబ్రవరిలో బ్యాంక్‌ను

ఎయిరిండియా విక్రయానికి కొత్త ప్రణాళిక

Thursday 20th June 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ఆర్థిక శాఖ మరో కొత్త ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఈ సారి చమురు ధరలు, మారకం రేటు హెచ్చు తగ్గులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. వాస్తవానికి ఎయిరిండియాలో గతేడాదే వాటాలు విక్రయించే ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఇలాంటి కారణాల వల్లే విఫలమైనట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై తేల్చి చెప్పడంతో తాజా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనలను ఎయిరిండియా

Most from this category