News


అమెజాన్‌లో నకిలీలకు చెక్‌..!

Wednesday 13th November 2019
news_main1573614752.png-29542

  • ప్రాజెక్ట్ జీరో ప్రారంభం

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ అంగళ్లలో బ్రాండెడ్‌ కంపెనీల వస్తువులకు బదులుగా కస్టమర్లకు  నకిలీలు అందుతున్న నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మంగళవారం ‘ప్రాజెక్ట్ జీరో’ను ప్రారంభించింది. అమెరికా, యూరప్‌, జపాన్‌ వంటి దేశాల్లో విజయవంతంగా అమలుచేసిన ఈ ప్రాజెక్టును తాజాగా భారత్‌లో ప్రారంభించడం ద్వారా తమ ప్లాట్‌ఫాంలో ఇక నుంచి నకిలీల బెడద ఉండబోదని ప్రకటించింది. ఈ అంశంపై అమెజాన్ కస్టమర్ ట్రస్ట్ అండ్‌ పాట్నర్‌ సపోర్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ధర్మేష్ మెహతా మాట్లాడతూ.. ‘వినియోగదారుల అభిప్రాయాలను తీవ్రంగా తీసుకుంటాం. ప్రాజెక్ట్ జీరోలో భాగంగా నకిలీల గుర్తింపు, నిరోధం, తొలగింపు నిమిత్తం అదనపు క్రియాశీలక విధానాలను, శక్తివంతమైన సాధనాలను తీసుకుని వచ్చాం’ అని వివరించారు. You may be interested

హోండా మనేసర్ ప్లాంట్‌ మూసివేత

Wednesday 13th November 2019

హర్యానాలోని మనేసర్ ప్లాంట్‌ను మూసివేసినట్లు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మంగళవారం ప్రకటించింది. ఆందోళనలో ఉన్న కార్మికులతో చర్చలు విఫలం కావడం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నవంబర్‌ 11 (సోమవారం) నుంచే ఈ నిర్ణయం అమల్లో ఉండగా.. మళ్లీ తిరిగి ప్లాంట్‌ ఎప్పుడు ప్రారంభమౌతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. 

‘ఓలా’లా...!

Wednesday 13th November 2019

‘కిచిడీ’ ద్వారా భారీగా ఆహార వ్యాపారంలోకి మరిన్ని సొంత ఫుడ్‌ బ్రాండ్లపై కసరత్తు... క్లౌడ్‌ కిచెన్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ ట్రక్కుల ఏర్పాటు బెంగళూరు: ట్యాక్సీ సేవల్లో దూసుకెళ్తున్న ఓలా... ఇకపై నోరూరించే వంటకాలతో ఆహార ప్రియులను ఆకర్షించనుంది. రాబడులు పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా సంస్థ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టింది. తాజాగా ఆహార వ్యాపార విభాగంలో భారీగా విస్తరిస్తోంది. దీనికోసం సొంత ఫుడ్‌ బ్రాండ్స్‌నూ ప్రవేశపెడుతోంది. స్విగీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ

Most from this category