News


అమెజాన్ ఇండియాతో ఫ్యూచర్‌ గ్రూప్ ఒప్పందాలు

Tuesday 7th January 2020
news_main1578367519.png-30714

  • ఆన్‌లైన్‌లో భారీగా కార్యకలాపాల విస్తరణ

    న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాతో ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెజాన్ షాపింగ్‌ పోర్టల్ ద్వారా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఫ్యూచర్ గ్రూప్ సంస్థలకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఈ ఒప్పందాల ప్రకారం ఫ్యూచర్ రిటైల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) స్టోర్స్‌కు అమెజాన్ అధీకృత ఆన్‌లైన్ సేల్స్ చానల్‌గా ఉండనుంది. ఆన్‌లైన్‌లో వచ్చే ఆర్డర్ల.. ప్యాకింగ్, పికప్‌ కోసం ఎఫ్‌ఆర్‌ఎల్ తమ రిటైల్ అవుట్‌లెట్స్‌లో తగు మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఇప్పటికే 22 స్టోర్స్‌లో ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి. నిత్యావసరాల సరఫరాకు సంబంధించిన అమెజాన్ 'ప్రైమ్ నౌ' సర్వీసుల్లో కూడా ఎఫ్‌ఆర్‌ఎల్‌కు చోటు లభిస్తుంది. బిగ్‌ బజార్‌, ఫుడ్‌హాల్‌ మొదలైన స్టోర్స్‌ను కూడా త్వరలో అమెజాన్ ఇండియాలో లిస్ట్ చేయాలని ఎఫ్‌ఆర్‌ఎల్ యోచిస్తోంది. 
    అలాగే, తమ కన్జూమర్ బ్రాండ్స్‌ను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు అమెజాన్‌తో ఫ్యూచర్ కన్జూమర్ లిమిటెడ్ (ఎఫ్‌సీఎల్‌) ఒప్పందం కుదుర్చుకుంది. టేస్టీ ట్రీట్, వూమ్, డ్రీమరీ, కార్మిక్‌ తదితర బ్రాండ్స్‌ వీటిలో ఉన్నాయి. ఇటు ఫిజికల్‌, అటు డిజిటల్ రంగాల్లో ఎదిగేందుకు రెండు సంస్థల మధ్య ఒప్పందాలు తోడ్పడతాయని ఎఫ్‌ఆర్‌ఎల్‌ సీఎండీ కిషోర్ బియానీ చెప్పారు. ఫ్యూచర్ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమెజాన్ 49 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అమెజాన్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఫ్యూచర్ కూపన్స్‌కు వాటాలు ఉన్నాయి. 



You may be interested

‘నానో’కు.. టాటా గుడ్‌బై

Tuesday 7th January 2020

2019లో ఒక్కటీ ఉత్పత్తి చేయలేదన్న కంపెనీ న్యూఢిల్లీ: లక్ష రూపాయలకే అంటూ మార్కెట్లోకి వచ్చిన రతన్‌ టాటా కలల కారు... ప్రజల కారు.. ‘నానో’ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఒక్క నానో కూడా ఉత్పత్తి చేయలేదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ‘2019లో జీరో ప్రొడక్షన్‌’ అంటూ.. నానో ఉత్పత్తిపై ఎక్సే‍్ఛంజీలకు కంపెనీ సోమవారం సమాచారమిచ్చింది. కాకపోతే అంతకు ముందటేడాది ఉత్పత్తి చేసిన ఒక కారును 2019 ఫిబ్రవరిలో విక్రయించామని మాత్రం

నిఫ్టీ నిరోధం 12,123

Tuesday 7th January 2020

 నేడు లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌! పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా రెండు రోజులపాటు పతన బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(మంగళవారం) లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 68 పాయింట్లు ఎగసి 12,111 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,043 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే.

Most from this category