News


భారత్‌లో అమెజాన్‌ రూ. 2,500 కోట్ల పెట్టుబడి

Saturday 8th February 2020
news_main1581133565.png-31614

న్యూఢిల్లీ: భారత్‌లో శరవేగంగా కార్యకలాపాలు విస్తరిస్తున్న అమెరికన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌.. తాజాగా మరో రూ. 2,500 కోట్లను ఇక్కడ పెట్టుబడిగా పెట్టింది. డేటా సర్వీసెస్ ఇండియా విభాగంలో రూ. 2,208 కోట్లు, సెల్లర్ సర్వీసెస్‌లో రూ.355 కోట్లను ఇన్వెస్ట్‌ చేసినట్లు నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. భారత పర్యటనలో భాగంగా ఇక్కడ రూ. 7,000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ జెఫ్ బెజోస్ ఇటీవలే ప్రకటించారు. తరవాత కొద్ది రోజుల్లోనే తాజా మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయడం విశేషం. మరోవైపు గతనెల్లోనే చెల్లింపులు, హోల్‌సేల్‌ వ్యాపార విభాగాల్లో రూ.1,700 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. 



You may be interested

రికార్డులకు బ్రేక్‌- యూఎస్‌ మార్కెట్‌ డీలా

Saturday 8th February 2020

0.5-1 శాతం మధ్య నీరసించిన ఇండెక్సులు మార్కెట్లను వీడని కరోనా భయాలు 8 నెలల్లో లేని విధంగా గత వారం రికార్డుల ర్యాలీ ఇండియన్‌ ఏడీఆర్‌ల నేలచూపు టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డౌన్‌ ఆర్థిక పురోగతిని పట్టిచూపుతూ జనవరిలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించి వెలువడినప్పటికీ శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. డోజోన్స్‌ 277 పాయింట్ల(0.9 శాతం) వెనకడుగుతో 29,102 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 18 పాయింట్లు(0.5 శాతం) తక్కువగా 3,328 వద్ద స్థిరపడింది.

వడ్డీరేటు తగ్గించిన కెనరాబ్యాంక్‌

Saturday 8th February 2020

ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ ఓవర్‌నైట్‌, నెల, మూడు, ఆరు నెలల కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఏడాది కాలానికి ఈ రేటు 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఫిబ్రవరి 7 నుంచీ తాజా రేటు అమల్లోకి వచ్చింది. దీనితో ఓవర్‌నైట్‌, నెల రేట్లు 7.65 శాతానికి తగ్గుతాయి. మూడు నెలల కాలానికి ఈ రేటు 7.95 శాతానికి తగ్గుతుంది. ఆరు నెలల కాలానికి 8.10 శాతం,

Most from this category