News


అమెజాన్‌ డెలివరీ విభాగంలోకి 10వేల ఎలక్ట్రిక్‌ వాహనాలు

Tuesday 21st January 2020
news_main1579576128.png-31061

  • 2025 నాటికి ప్రవేశపెడతామని ప్రకటన

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థ అమేజాన్‌ ఇండియా తన డెలివరీ విభాగంలో 2025 నాటికి 10వేల ఎలక్ట్రిక్‌ వాహనాలను చేర్చుకోనుంది. ప్రయోగాత్మకంగా భారత్‌లోని పలు పట్టణాల్లో 2019లో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెట్టామని, ఇప్పుడు దేశవ్యాప్తంగా డెలివరీ నెట్‌వర్క్‌లోకి మరిన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలను చేర్చుకోనున్నట్టు అమేజాన్‌ ఇండియా సోమవారం ప్రకటించింది. మూడు చక్రాలు, నాలుగు చక్రాల వాహనాలు ఇందులో ఉంటాయని పేర్కొంది. 2020లో హైదరాబాద్‌, బెంగళూరు, నాగ్‌పూర్‌, పుణె, అహ్మదాబాద్‌ తదితర పట్టణాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు నిర్వహణలోకి వస్తాయని వెల్లడించింది. పర్యావరణం పట్ల బాధ్యతలో భాగంగా 2030 నాటికి అంతర్జాతీయంగా తమ నెట్‌వర్క్‌ పరిధిలో లక్ష ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెట్టాలని అమేజాన్‌ తీసుకున్న నిర్ణయానికి భారత్‌లో ప్రకటించినవి అదనం. భారత్‌లో చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను డిజిటల్‌గా మార్చేందుకు బిలియన్‌ డాలర్లను (రూ.7,000 కోట్లు) పెట్టుబడిగా పెట్టడంతోపాటు, 2025 నాటికి 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్టు అమేజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ రెండు రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌ సైతం తమ డెలివరీ విభాగంలో 40 శాతం వ్యాన్ల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను 2020 మార్చి నాటికి ప్రవేశపెట్టనున్నట్టు గతేడాదే ప్రకటించిన విషయం గమనార్హం. 



You may be interested

బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభం

Tuesday 21st January 2020

సంప్రదాయ హల్వా రుచులతో కీలక ఘట్టానికి శ్రీకారం ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఫైనాన్స్‌ బిల్లు న్యూఢిల్లీ: సాంప్రదాయక హల్వా రుచుల ఆస్వాదనతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-2021) బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్‌ 2020-21 ఫైనాన్స్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.  నరేంద్రమోదీ రెండవసారి ప్రధానిగా అధికార పగ్గాలు

వాహన పరిశ్రమకు మంచిరోజులు..

Tuesday 21st January 2020

2020పై ఆశావహంగా సియామ్‌ కోల్‌కతా: అమ్మకాలు పడిపోయి సంక్షోభంలో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ 2020పై గంపెడాశలు పెట్టుకుంది. ఈ ఏడాది మళ్లీ పుంజుకోగలమని వాహన సంస్థల సమాఖ్య సియామ్ అంచనా వేస్తోంది. దేశీయంగా వాహనాల వినియోగం ఇప్పటికీ తక్కువగానే ఉన్న నేపథ్యంలో.. పలు విదేశీ సంస్థలు భారత్‌ మార్కెట్లో ప్రవేశించేందుకు ఈ అవకాశాలను అందిపుచ్చుకోగలవని భావిస్తోంది. సియామ్ డిప్యుటీ డైరెక్టర్‌ సుగతో సేన్ ఈ విషయాలు వెల్లడించారు. "గడిచిన 20 ఏళ్లలో

Most from this category