News


ఉద్యోగార్ధులకు అమెజాన్‌ నెం.1!

Monday 17th June 2019
news_main1560767283.png-26354

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఉద్యోగ సంస్థగా నిలిచింది. తరువాత స్థానాలలో మైక్రోసాఫ్ట్ ఇండియా, సోనీ ఇండియాలు ఉన్నాయి. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్‌) సోమవారం విడుదల చేసిన సర్వే- 2019 ప్రకారం ఆర్థికంగా మంచి వాతవరణం కల్పిస్తుండడం, తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, బలమైన సంస్థగా పేరుండడం వంటి అంశాలు అమోజాన్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడంలో సహాయపడ్డాయి. మైక్రోసాఫ్ట్ ఇండియా రెండవ స్థానంలో, సోనీ ఇండియా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన టాప్ 10 బ్రాండ్లలో మెర్సిడెస్ బెంజ్ 4 వ స్థానం, ఐబిఎం (5 వ), లార్సెన్ & టౌబ్రో (6 వ), నెస్లే (7 వ), ఇన్ఫోసిస్ (8 వ), శామ్సంగ్ (9 వ), డెల్ (10 వ) స్థానాల్లో నిలిచాయి. ఆర్‌ఈబీఆర్‌ పద్ధతిని అనుసరించి వరుసగా మూడు సంవత్సరాలు టైటిల్‌ను గెలుచుకున్న గూగుల్ ఇండియా గత సంవత్సరం హాల్ ఆఫ్ ఫేమ్ విభాగంలోకి చేరిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 75 శాతం కవర్‌ చేస్తున్నా 32 దేశాలలో 2,00,000 మందికి పైగా స్పందనతో ఈ సర్వే జరిగిందని రాండ్‌ స్టాడ్‌ తెలిపింది.

ఉద్యోగ లాభాలు, జీతం, జాబ్‌సెక్యూరిటలకు ప్రాధాన్యం
సంస్థల్లో ఉద్యోగాన్ని ఎన్నుకునేటప్పుడు జీతం, ఉద్యోగ లాభాలు, జీవితం-పని మధ్య సమతుల్యత, జాబ్‌ సెక్యూరిటి వంటి వాటిపై ఆశావహులు దృష్ఠి పెడుతున్నారని వివరించింది. ‘నైపుణ్యం గల ప్రతిభావంతులను కొరుకునే సంస్థలైన, జీవీతంలో అర్థవంతమైన కెరీర్‌కు సహకరించే సంస్థలను కోరుకునే ఉద్యోగులకైన ఎంప్లాయర్‌ బ్రాండ్‌ అవసరం’ అని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ,సీఈఓ పాల్ డుపుయిస్ అన్నారు. భారతీయులలో అధిక శాతం (55 శాతం) పెద్ద బహుళ-జాతీయ సంస్థలలో పనిచేయడానికి ఇష్టపడతున్నారని, కేవలం 9 శాతం మంది మాత్రమే స్టార్ట్‌ప్‌ కంపెనీలలో పనిచేయడానికి సిద్ధపడుతున్నారని నివేదిక తెలిపింది. ఉద్యోగ భద్రత, ఆర్థికంగా మంచి అవకాశాలు కల్పిస్తుండడం, కెరీర్‌ పురోగతి వంటివి ఎమ్‌ఎన్‌సీ వైపు ఆశావహులను ఆకర్షిస్తున్నాయి. ఇండియాలో ఉద్యోగార్ధు‍లు ఐటి, ఐటిఇఎస్, టెలికాం (67 శాతం), రిటైల్, ఎఫ్‌ఎంసిజి, ఇ-కామర్స్ (67 శాతం), ఆటోమోటివ్ (66 శాతం), బీఎఫ్‌ఎస్‌ఐ (65 శాతం) రంగాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.You may be interested

39000ల దిగువన ముగిసిన సెన్సెక్స్‌

Monday 17th June 2019

11700ల దిగువకు నిఫ్టీ  ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు దేశీయ మార్కెట్లో నెలకొన్న బలహీనత పరిస్థితుల నేపథ్యంలో సోమవారం మార్కెట్‌ భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ ఏకంగా 491 పాయింట్లను నష్టపోయి 39000ల దిగువను 38,960.79 వద్ద ముగిసింది. నిఫ్టీ 151 పాయింట్లు క్షీణించి 11700 స్థాయిని కోల్పోయి 11,672.15 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, మరింత తీవ్రతరమవుతున్న వాణిజ్య యుద్ధ ఆందోళనలు, పెరిగిన క్రూడాయిల్‌ ధరలు, ఈక్విటీ మార్కెట్లలో

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు షేర్లే సేఫ్‌: యూబీఎస్‌

Monday 17th June 2019

ప్రస్తుతం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ షేర్లు గడ్డుకాలం ఎదుర్కోంటున్న తరుణంలో, ఇన్వెస్టర్లు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేర్లు ఎంపిక మంచిదని విదేశీ బ్రోకింగ్‌ దిగ్గజం యూబీఎస్ సూచిస్తుంది. వచ్చే  3-4 ఏళ్లలో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల లోన్‌బుక్స్‌, ఆదాయాలు పరిశ్రమ సగటు వృద్ధి కంటే రెండు రెట్లు పెరిగే అవకాశం ఉందని బ్రోకింగ్‌ సంస్థ తెలిపింది. రుణ విభాగాల్లో పటిష్టమైన నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ కలిగి ఉండటంతో పాటు నాన్‌

Most from this category