News


పండుగ సీజన్‌లో అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్లు

Friday 27th September 2019
news_main1569558322.png-28581

న్యూఢిల్లీ:- ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఈ పండుగల సీజన్‌లో కస్టమర్లకు భారీ ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది. ‘గ్రేట్‌ ఇండియాన్‌ ఫెస్టివల్’ పేరిట ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు భారీ ఆఫర్లను ఇవ్వనున్నట్లు ఆ సంస్థ క్యాటగిరీ మెనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్ తివారీ తెలిపారు. ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు చేసినవారికి 10 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని చెప్పారు. బజాన్‌ ఫిన్‌సర్వ్‌, కార్డుల ద్వారా కొనుగోలుచేసిన వారికి నో-కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ వర్తిస్తుంది. లక్షలాది సెల్లర్స్‌ అత్యంత తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమెజాన్‌లో అందించనున్నారని పేర్కొన్నారు. 



You may be interested

ఒడిదుడుకుల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 27th September 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో  మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.49 సమయానికి నిఫ్టీ 50 10.75 పాయింట్లు కోల్పోయి 11,560.45 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 18.92 పాయింట్లు లాభపడి 39,008.66 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లలో ఒత్తిడి వలన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం 9.49 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌  59.95 పాయింట్లు నష్టపోయి 30029.90 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో

లాభనష్టాల మధ్య ఊగిసలాట

Friday 27th September 2019

అక్టోబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ప్రారంభపు రోజైన శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో స్టాక్‌ సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,850 పాయింట్లకు అటూఇటూ హెచ్చుతగ్గులకు లోనవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,550 పాయింట్ల స్థాయికి ఇరువైపులా 35 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడుతోంది.

Most from this category