News


వచ్చే వారం భారత్‌కు అమెజాన్‌ బెజోస్‌

Friday 10th January 2020
news_main1578628250.png-30818

  •  ప్రధాని మోదీతో భేటీకి అవకాశం

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ వచ్చే వారం భారత్‌ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రభుత్వాధికారులు, పలువురు వ్యాపార దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యే అవకాశమున్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. జనవరి 15-16న న్యూఢిల్లీలో జరిగే చిన్న, మధ్యతరహా సంస్థల సదస్సు ఎస్‌ఎంభావ్‌ కార్యక్రమంలో బెజోస్ పాల్గోనున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలపై దేశీయంగా చిన్న వర్తకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో బెజోస్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశీ పెట్టుబడులున్న ఈ-కామర్స్ సంస్థల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్రం గతేడాది చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో నియంత్రణపరమైన అంశాల గురించి చర్చించేందుకు ప్రభుత్వాధికారులతో బెజోస్‌ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 



You may be interested

ఓబీసీ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు

Friday 10th January 2020

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ (ఓబీసీ) తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ (ఎంసీఎల్‌ఆర్‌) ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ తగ్గింపు 0.05-0.15 శాతం శ్రేణిలో ఉంది. ప్రామాణిక ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ను 0.15 శాతం తగ్గించడంతో 8.15 శాతానికి చేరినట్లు బ్యాంకు తెలిపింది. ప్రధానంగా కన్జూమర్ రుణాలపై వడ్డీ రేట్లు దీని ఆధారంగానే ఉంటాయి. మరోవైపు, 15 రోజుల నుంచి 6

శుక్రవారం వార్తల్లోని స్టాక్స్‌

Friday 10th January 2020

అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఉపశమించిన నేపథ్యంలో గురువారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. దేశీయంగా సెన్సెక్స్‌ 635 పాయింట్లు జంప్‌చేసి 41,452కు చేరగా.. నిఫ్టీ సైతం 191 పాయింట్లు ఎగసి 12,216 వద్ద ముగిసింది. ఇక యూఎస్‌ మార్కెట్లు 0.7 శాతం బలపడటం ద్వారా సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు ‍స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అయ్యే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు

Most from this category