STOCKS

News


ఇక అమెజాన్‌ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ

Tuesday 30th July 2019
news_main1564464897.png-27402

 

  • సెప్టెంబర్‌ నుంచి అందుబాటులోకి !

బెంగళూరు: ఆన్‌లైన్‌ దిగ్గజం, అమెజాన్‌డాట్‌కామ్‌ భారత్‌లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఐటీ ఇండస్ట్రియలిస్ట్‌, నారాయణ మూర్తి స్థాపించిన కాటమరన్‌ వెంచర్‌ ఫండ్‌తో ఈ వ్యాపారానికి సంబంధించి ప్రస్తుతం అమెజాన్‌డాట్‌కామ్‌ చర్చలు జరుపుతోందని సమాచారం. . ఈ వ్యాపారంలోకి రావడానికి ఇప్పుడిప్పుడే ఉద్యోగులను నియమించుకుంటోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో  పండుగల సీజన్‌ మొదలయ్యే సెప్టెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీసులను అందుబాటులోకి అమెజాన్‌ ప్రయత్నాలు చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు 176 శాతం అప్‌...
భారత్‌లో మధ్య తరగతి పెరుగుతుండటంతో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలకు డిమాండ్‌ జోరుగా పెరుగుతోంది. గత ఏడాది ఆన్‌లైన్‌ ఆర్డర్లు 176 శాతం పెరిగాయి. భారత్‌లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలో స్విగ్గీ, జొమాటోలు అగ్రస్థానంలో ఉన్నాయి. ట్యాక్సీ అగ్రిగేటర్‌ ఉబెర్‌, ఓలాలు కూడా ఫుడ్‌ డెలివరీ సర్వీసులను ఆరంభించాయి. ఉబెర్‌ సంస్థ, 2017లో ఉబెర్‌ ఈట్స్‌ పేరుతో ఈ పుడ్‌ డెలివరీ సర్వీసులను ప్రారంభించినప్పటికీ, స్విగ్గీ, జొమాటోలతో పోటీపడలేకపోతోంది.  ఉబెర్‌ ఈట్స్‌ను అమెజాన్‌ కొనుగోలు చేయనున్నదని కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ వ్యాపారం నుంచి వైదొలగాలని ఓలా నిర్ణయించుకుంది. కాగా పోటీ తీవ్రత  అధికంగా ఉండటంతో అమెరికాలో తన ఫుడ్‌ డెలివరీ సర్వీసుల విభాగాన్ని అమెజాన్‌ మూసేసింది. 

అమెజాన్‌ సంస్థ 2016లో ప్రైమ్‌ సర్వీసులను భారత్‌లో ప్రారంభించింది. వీడియో, మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసులను అందిస్తోంది. ఇటీవలనే కిరాణా సరుకుల డెలివరీ సర్వీసుల వ్యాపారాన్ని కూడా ఆరంభించింది. 



You may be interested

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్ల కోత

Tuesday 30th July 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ కాలపరిమితులపై డిపాజిట్‌ రేట్లను తగ్గించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు (ప్రస్తుతం 5.75 శాతం) తగ్గింపు వంటి అంశాలు దీనికి నేపథ్యం. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్‌బీఐ వరుసగా మూడుసార్లు మొత్తం 75 బేసిస్‌ పాయింట్లు (ముప్పావుశాతం)

కంపెనీల వేటలో డాక్టర్ రెడ్డీస్‌..

Tuesday 30th July 2019

క్యూ1లో లాభం 45 శాతం అప్‌ రూ. 663 కోట్లుగా నమోదు ఆగస్టు నుంచి కొత్త సీఈవోగా ఎరెజ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) తాజాగా మరింత వృద్ధి సాధించే దిశగా ఇతర కంపెనీలను కొనుగోలు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు వివిధ దశల్లో ఉన్నాయి. రుణ, ఈక్విటీ నిష్పత్తి కనిష్ట స్థాయిలో ఉండటంతో ఇతర సంస్థల కొనుగోలుకు ఆర్థికంగా కొంత

Most from this category