News


ఫుడ్‌ డెలివరీలోకి అమెజాన్‌

Friday 28th February 2020
news_main1582860660.png-32152

  • ప్రస్తుతం బెంగళూరులో పైలట్‌ ప్రాజెక్టు
  • మార్చిలో పూర్తి స్థాయిలో ఆవిష్కరించే అవకాశం
  • ప్రైమ్‌ నౌ యాప్‌ ద్వారా అందుబాటులోకి

న్యూఢిల్లీ: అమెరికన్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ .. భారత్‌లో కార్యకలాపాలను జోరుగా విస్తరిస్తోంది. కేవలం ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌కే పరిమితం కాకుండా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా ఫుడ్‌ డెలివరీ సేవలను కూడా ప్రారంభించనుంది. తద్వారా ఈ విభాగంలో దిగ్గజాలైన స్విగీ, జొమాటోలకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫుడ్‌ డెలివరీ వ్యాపారాన్ని మార్చిలో ప్రకటించవచ్చని, ప్రైమ్‌ నౌ యాప్‌ ద్వారా ఈ సర్వీసులు అందించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విగీ, జొమాటోలు డిస్కౌంట్లలో కోత పెట్టి, కఠిన వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్న పరిస్థితుల్లో అమెజాన్‌ ఎంట్రీ ఇవ్వబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌ ఈమధ్యే తమ ఉబెర్‌ఈట్స్‌ ఇండియాను జొమాటోకు విక్రయించేసిన సంగతి తెలిసిందే.

సమగ్ర వ్యాపార వ్యూహం..
ప్రైమ్‌ పెయిడ్‌ చందాదారులకు.. నిత్యావసరాలు, ఆహారం మొదలుకుని ఎలక్ట్రానిక్స్, ఇతరత్రా గృహావసరాల ఉత్పత్తుల శ్రేణిని అందించే వ్యూహంలో భాగంగానే అమెజాన్‌ ఈ కొత్త విభాగంలోకి ప్రవేశిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లోకి ప్రవేశించేందుకు అమెజాన్‌ మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చోదని.. మార్కెట్లోకి ఎప్పుడొచ్చామన్నది కాకుండా.. చివర్లో వచ్చినా కూడా గెలవొచ్చన్నది ఆ సంస్థ సిద్ధాంతమని పేర్కొన్నాయి. ఫుడ్‌ బిజినెస్‌నే అమెజాన్‌ ఎందుకు ఎంచుకున్నది వివరిస్తూ.. కన్జూమర్‌ టెక్నాలజీతో ముడిపడి ఉన్న వ్యాపార విభాగాల్లో ఫుడ్‌ డెలివరీకి అత్యధికంగా ఆదరణ ఉంటుందని .. తర్వాత స్థానాల్లో నిత్యావసరాలు, ఎఫ్‌ఎంజీసీ, సాధారణ ఈ–కామర్స్‌ లావాదేవీలు ఉంటాయని ఓ ఇన్వెస్టరు వివరించారు. ప్రధాన నగరాల్లో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టే వినియోగదారులు, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు చేసే వారిని ఆకర్షించాలన్నది అమెజాన్‌ వ్యూహం. ప్రస్తుతానికి అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీసులను సొంత ఉద్యోగులకే అమెజాన్‌ అందిస్తోంది. బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్, బెల్లందూరు, హరలూరు, మరతహళ్లి, వైట్‌ఫీల్డ్‌ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. 

హోటళ్లతో ఒప్పందాలు ..
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తికి చెందిన కాటమారన్‌ వెంచర్స్, అమెజాన్‌ ఇండియా కలిసి ఏర్పాటు చేసిన ప్రైవన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ సారథ్యంలో ఈ కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ డైరెక్టర్‌ (ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం) రఘు లక్కప్రగడ ఈ వ్యూహానికి సారథ్యం వహిస్తున్నారు. పోటీ సంస్థలతో పోలిస్తే తక్కువ కమీషన్‌ కోట్‌ చేస్తూ హోటళ్లు, రెస్టారెంట్లతో ప్రైవన్‌ బిజినెస్‌ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. సుమారు 10–15 శాతం కమీషన్‌ను అమెజాన్‌ ప్రతిపాదిస్తోంది. స్విగీ, జొమాటోలతో పోలిస్తే ఇది దాదాపు సగం. 

లాజిస్టిక్స్‌పై భారీగా పెట్టుబడులు..
ఫుడ్‌ డెలివరీ వ్యాపారం విజయవంతం కావాలంటే అమెజాన్‌ ఎక్కువగా లాజిస్టిక్స్, రెస్టారెంట్‌ వ్యవస్థ, టెక్నాలజీ, మార్కెటింగ్‌పై గణనీయంగా ఇన్వెస్ట్‌ చేయాల్సి వస్తుందని నిపుణులు తెలిపారు. అలాగే, స్విగీ.. జొమాటోలను ఢీకొనాలంటే.. కొరియన్, జపానీస్‌ మొదలైన వంటకాలు కూడా అందించే రెస్టారెంట్లతో అమెజాన్‌ ప్రత్యేక ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశముందని వివరించారు. ఇటీవలే 350 మిలియన్‌ డాలర్లతో ఉబెర్‌ఈట్స్‌ను జొమాటో కొనుగోలు చేసింది. అటు స్విగీ కూడా ఇటీవలే ప్రస్తుత ఇన్వెస్టరు, దక్షిణాఫ్రికా దిగ్గజం నాస్‌పర్స్‌ సారథ్యంలో మరికొందరు ఇన్వెస్టర్ల నుంచి సుమారు 113 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. You may be interested

సెన్సెక్స్‌ 1000 పాయింట్లు క్రాష్‌

Friday 28th February 2020

11350 వద్ద నిఫ్టీ ప్రారంభం మార్కెట్‌కు కరోనా వైరస్‌ భయాలు కరోనా వైరస్‌ వ్యాధి భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న కలవరం దేశీయ ఈక్విటీ మార్కెట్‌ తాకింది. ఫలితంగా శుక్రవారం బెంచ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌లు భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 1000 పతనమైన 39000ల దిగువన 38746.95 మొదలైంది. నిఫ్టీ 270 పాయింట్లు క్షీణించి 11353.70 సమీపంలో ప్రారంభమైంది. నేటి మార్కెట్‌ ముగింపు అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికపు

నెలకు 11 జీబీ డేటా!!

Friday 28th February 2020

- భారతీయుల సగటు వినియోగం - చౌక డేటా ప్లాన్లు, హ్యాండ్‌సెట్స్‌ ఊతం - నోకియా నివేదిక న్యూఢిల్లీ: చౌక డేటా ప్లాన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, వీడియో సేవలు, 4జీ నెట్‌వర్క్‌ విస్తరించడం తదితర అంశాల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం నెలకు సగటున 11 జీబీ స్థాయిలో వినియోగం ఉంటోంది. టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా రూపొందించిన వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్

Most from this category