News


ఈ-కామర్స్‌ అమ్మకాలు రూ.15,000 కోట్లు

Tuesday 16th October 2018
news_main1539666249.png-21192

న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్‌ సంస్థలు పండుగ సీజన్‌ అమ్మకాలలో సంచలనం సృష్టించాయి. గడిచిన 5 రోజుల ఫెస్టివల్‌ సేల్స్‌లో ఏకంగా 64 శాతం వృద్ధిరేటును సాధించినట్లు రెడ్‌సీర్‌ కన్సెల్టింగ్‌ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం అక్టోబర్ 9 నుంచి 14 వరకు కొనసాగిన పండుగ సీజన్‌ ఆఫర్లలో రూ.15,000 కోట్లు అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో రూ.10,325 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మరోవైపు ఈ సీజన్‌లో విలువైన గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు గణనీయంగా జరిగినట్లు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు వెల్లడించాయి. 



You may be interested

టాటామోటర్స్‌ నిర్ణయంతో షాకయ్యాం!

Tuesday 16th October 2018

జాయింట్‌ వెంచర్‌ నుంచి వైదొలగాలన్న టాటామోటర్స్‌ నిర్ణయం తొలుత తమకు షాక్‌ కలిగించిందని టాటా హిటాచీ సీనియర్‌ డైరెక్టర్‌ షిన్‌ నకజిమా చెప్పారు. టాటాల నుంచి అలాంటి అనూహ్య నిర్ణయాన్ని తాము ఊహించలేదన్నారు. హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జేవీ వాటా విక్రయం, రూపీ క్షీణత, యెన్‌ మారకం తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలివీ... ప్ర: టాటా హిటాచీ జాయింట్‌ వెంచర్‌లో

మళ్లీ ‘జారుడు బల్ల’పై ఎగుమతుల విలువ!

Tuesday 16th October 2018

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు సెప్టెంబర్‌లో మళ్లీ పడిపోయాయి. 2017 సెప్టెంబర్‌తో పోల్చితే 2018 సెప్టెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాలేదు. ఈ విలువ -2.15 శాతం క్షీణించింది. మార్చి (-0.66 శాతం)  తరువాత ఎగుమతులు క్షీణతలోకి జారడం ఇదే తొలిసారి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగితే, దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌- ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య నికర వ్యత్యాసం) మరింత

Most from this category