News


అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలు

Monday 2nd December 2019
Markets_main1575260796.png-29997

  • ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘించాయ్‌ 
  • వాటిపై చర్య తీసుకోండి 
  • కెయిట్‌ డిమాండ్‌ 

న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సం‍స్థలని అఖిల భారత వర్తకుల సమాఖ్య(సీఏఐటీ-కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌) తీవ్రంగా విమర్శించింది. ఇవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. చిన్న వ్యాపారస్తులు గత ఏడాది కాలంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇంకా ఇతర ఈ కామర్స్‌ సం‍స్థల చేతుల్లో విలవిలలాడుతున్నాయని, ఫలితంగా వాటి వ్యాపారం దెబ్బతిన్నదని  ఆవేదన వ్యక్తం చేసింది. భారత్‌ను 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించింది. 

నిబంధనల ప్రకారమే...
భారత్‌లో మార్కెట్‌ ప్లేస్‌ మోడల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, భారత చట్టాల ప్రకారమే వ్యాపారం చేస్తున్నామని, ఎలాంటి ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని ఫ్లిప్‌కార్ట్‌ స్పష్టం చేసింది. దురుద్దేశపూరితంగానే కొన్ని సంస్థలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని, ఇది దురదృష్టకరమని పేర్కొంది. రూ. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడానికి నవకల్పన, టెక్నాలజీతో కూడిన డిజిటల్‌ కామర్స్‌ కీలకం కానున్నదని వివరించింది. కాగా అమెజాన్‌ ఇండియా ఈ విషయమై ఇంకా స్పందించలేదు. 



You may be interested

ఈ రుణం ‘బంగారం’ కాను..

Monday 2nd December 2019

బంగారంపై సులభంగా, వేగంగా రుణం వడ్డీ కూడా తక్కువే చెల్లింపుల్లో సౌలభ్యం వడ్డీ వరకే చెల్లించొచ్చు అసలు తర్వాత చెల్లించే సదుపాయం ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే వెంటనే తెలిసిన వారి దగ్గర చేబదులు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. పర్సనల్‌ లోన్‌కు వెళ్లాలంటే అందుకు కొన్ని రోజుల సమయం తీసుకుంటుంది. వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణం తెచ్చుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో భారం పడుతుంది. ఇటువంటి అవసరాల్లో అన్నింటికంటే మెరుగైన మార్గంగా బంగారంపై రుణాన్ని చెప్పుకోవాలి.

బ్యాంకింగ్‌, చమురు రంగాల షేర్లలోకి అత్యధిక ఎఫ్‌పీఐలు

Monday 2nd December 2019

నవంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన రంగాల షేర్లలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో 70 శాతం ప్రధానంగా రెండు రంగాల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్‌, చమురు మరియు గ్యాస్‌ రంగాల షేర్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో సింహభాగం చేరాయి. నవంబర్‌ 1- 15 కాలంలో ఎఫ్‌ఐఐలు దేశీయ స్టాక్స్‌లో 14326 కోట్ల పెట్టుబడులు పెట్టగా ఇందులో 46 శాతం అంటే 6630 కోట్లు బ్యాంకు స్టాకుల్లోకి, చమురు

Most from this category