News


అమెజాన్‌ డైరెక్టర్‌గా ఇంద్రా నూయి

Wednesday 27th February 2019
news_main1551241226.png-24350

  • అమెజాన్‌కు రెండో మహిళ డైరెక్టర్‌ 

వాషింగ్టన్‌: పెప్సికో కంపెనీకి సీఈఓగా పనిచేసిన  భారత సంతతి ఇంద్రా నూయి(63) అమెజాన్‌ కంపెనీ డైరెక్టర్‌ అయ్యారు. ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం, అమెజాన్‌లో డైరెక్టర్‌ అయిన రెండో మహిళ ఇంద్రా నూయి. ఈ నెలారంభంలోనే స్టార్‌బక్స్‌ ఎగ్జిక్యూటివ్‌​ రోసలిండ్‌ బ్రెవర్‌ అమెజాన్‌లో డైరెక్టర్‌గా చేరారు. ఒక్క నెలలోనే ఇద్దరిని కొత్త డైరెక్టర్లుగా నియమించామని, వీరిద్దరికీ స్వాగతమని అమెజాన్‌ పేర్కొంది. ఇంద్రా నూయి ఆడిట్‌ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తారు. 
పెప్సికోలో డైరెక్టర్‌గా నియమితులైన ఇంద్రా నూయి 2001లో ఆ కంపెనీకి ప్రెసిడెంట్‌గా, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా ఎదిగారు. ఫైనాన్స్‌, కార్పొరేట్‌ స్ట్రాటజీ, డెవలప్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ ప్లానింగ్‌ వంటి విభాగాల్లో అత్యున్నత స్థాయిల్లో పనిచేశారు. పెప్సికో కంపెనీకి  2006 నుంచి 2018 వరకూ  సీఈఓగా పనిచేశారు. 2007, మే నుంచి 2019, ఫిబ్రవరి వరకూ  డైరెక్టర్ల బోర్డ్‌ చైర్మన్‌గా  వ్యవహరించారు. You may be interested

1.2 లక్షల కోట్ల డాలర్లకు ఈ-కామర్స్‌

Wednesday 27th February 2019

2021 నాటికి దేశీ మార్కెట్‌పై అంచనాలు డెలాయిట్ ఇండియా, రిటైలర్స్ అసోసియేషన్ నివేదిక ముంబై: దేశీ ఈ-కామర్స్ మార్కెట్ 2021 నాటికి 1.2 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనుంది. అప్పటికి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వినియోగదారుల మార్కెట్‌గా మారనుంది. డెలాయిట్ ఇండియా, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ-కామర్స్ మార్కెట్... కొనుగోలుదారులు ఆన్‌లైన్ వైపు మళ్లుతున్న

మాక్స్‌బుపాలో వాటా విక్రయించిన మ్యాక్స్‌ ఇండియా

Wednesday 27th February 2019

డీల్‌ విలువ రూ.510 కోట్లు  న్యూఢిల్లీ: మాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను మ్యాక్స్‌ ఇండియా విక్రయించింది. ఈ వాటాను ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, ​ ట్రూ నార్త్‌ ఫండ్‌ ఫోర్‌ ఎల్‌ఎల్‌పీకి విక్రయించామని మ్యాక్స్‌ ఇండియా తెలిపింది. ఈ డీల్‌  విలువ రూ.510 కోట్లని పేర్కొంది.  మొత్తం నగదులోనే ఈ లావాదేవీ జరిగింది. ఈ లావేదేవీ పరంగా చూస్తే, మాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌

Most from this category