News


అలహాబాద్‌ బ్యాంకులో మరో ఫ్రాడ్‌

Friday 19th July 2019
news_main1563522512.png-27177

  • రూ. 688 మోసానికి పాల్పడిన ఎస్‌ఈఎల్‌ఎం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ కార్యకలాపాల తీరుపై సందేహాలు రేకెత్తించేలా తాజాగా మరో మోసం బైటపడింది. ఎస్‌ఈఎల్‌ మ్యాన్యుఫాక్చరింగ్ (ఎస్‌ఈఎల్‌ఎం) రూ. 688.27 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు అలహాబాద్ బ్యాంకు వెల్లడించింది. దీనికి సంబంధించి ప్రొవిజనింగ్ చేసినట్లు, ఫ్రాడ్ గురించి ఆర్‌బీఐకి కూడా తెలియజేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎస్‌ఈఎల్‌ఎం దివాలా పిటీషన్‌పై ఎన్‌సీఎల్‌టీలో విచారణ జరుగుతున్నట్లు వివరించింది. వారం రోజుల వ్యవధిలో అలహాబాద్‌ బ్యాంకులో ఇది రెండో ఫ్రాడ్ కేసు కావడం గమనార్హం. భూషణ్ పవర్ అండ్ స్టీల్‌ (బీపీఎస్‌ఎల్‌) రూ. 1,775 కోట్ల మోసానికి పాల్పడినట్లు గత శనివారమే బ్యాంకు వెల్లడించింది. You may be interested

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం రూ.359 కోట్లు

Friday 19th July 2019

-15 శాతం వృద్ధితో రూ.2,485 కోట్లకు ఆదాయం  న్యూఢిల్లీ: లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) గ్రూప్‌నకు చెందిన ఐటీ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ ఇన్పోటెక్‌(ఎల్‌టీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.359 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.361 కోట్లు)తో పోల్చితే ఒకటిన్నర శాతం క్షీణత నమోదైందని ఎల్‌టీఐ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.2,156 కోట్ల నుంచి

ఈబే చేతికి పేటీఎమ్‌ మాల్‌లో 5.5 శాతం వాటా

Friday 19th July 2019

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే స్టోర్‌  న్యూఢిల్లీ: భారత ఈ కామర్స్‌ ప్లాట్‌ఫార్మ్‌, పేటీఎమ్‌ మాల్‌లో 5.5 శాతం వాటాను అమెరికా ఈ-టైలర్‌ ఈబే కొనుగోలు చేసింది.  ఈ వాటా కొనుగోలుకు సంబంధించి ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. ఈ డీల్‌లో భాగంగా పేటీఎమ్‌ మాల్‌లో ఒక స్టోర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఈబే ప్రెసిడెంట్‌, సీఈఓ డెవిన్‌ వెన్‌ చెప్పారు. భారత ఈ కామర్స్‌ రంగంలో ఈబేకు ఇది మూడో పెట్టుబడి. గతంలో

Most from this category