News


మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయం

Saturday 28th December 2019
news_main1577506016.png-30490

  • ఐవోబీ, యూకో, అలహాబాద్‌ బ్యాంకులకు రూ.8,655 కోట్లు

న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు గాను యూకో, ఇండియన్‌ ఓవర్సీస్‌, అలహాబాద్‌ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ.8,655 కోట్ల నిధుల సాయాన్ని అందించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపు రూపంలో బ్యాంకులకు ఈ నిధులు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పెట్టుబడుల విషయమై బ్యాంకులకు సమాచారం అందించింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.4,360 కోట్లు అందుకోనున్నట్టు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు (ఐవోబీ) శుక్రవారం ప్రకటించింది. ఐవోబీకి రూ.3,800 కోట్ల సాయాన్ని గత ఆగస్ట్‌లోనే ప్రభుత్వం ప్రకటించగా, ఈ సాయాన్ని మరో రూ.560 కోట్లు అధికం చేసింది. అలాగే, యూకో బ్యాంకుకు కూడా రూ.2,142 కోట్ల సాయాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలిపింది. ఈ రెండు బ్యాంకులు ఆర్‌బీఐ కచ్చిత దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలో ఉన్నాయి. ఐవోబీ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.2,254 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 20 శాతంగా ఉన్నాయి. యూకో బ్యాంకు కూడా సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.892 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రూ.2,153 కోట్ల ఈక్విటీ సాయాన్ని అందుకోనున్నట్టు అలహాబాద్‌ బ్యాంకు గురువారమే ప్రకటించింది. 



You may be interested

పడిపోతున్న ఆదాయంతో ప్రమాదం!

Saturday 28th December 2019

ద్రవ్య గణాంకాలు గతి తప్పుతాయి ఆర్‌బీఐ హెచ్చరిక ముంబై: పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను, పన్నేతర ఆదాయం లక్ష్యాలకు దూరంగా ఉండడంతోపాటు, ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం బలహీనపడడం సవాలుగా పేర్కొంది. శుక్రవారం ముంబైలో విడుదల చేసిన 25వ ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో ఈ అంశాలను ప్రస్తావించింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. బ్యాంకులు,

నాస్‌డాక్‌ 11 రోజుల ర్యాలీకి బ్రేక్‌

Saturday 28th December 2019

యూఎస్‌ మార్కెట్లు అటూఇటూ డోజోన్స్‌ ప్లస్‌లో- నాస్‌డాక్‌ మైనస్‌ ఎస్‌అండ్‌పీ-500 యథాతథం వారాంతాన యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్‌ 24 పాయింట్ల(0.08 శాతం) స్వల్ప లాభంతో 28,645 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ దాదాపు యథాతథంగా 3240 వద్ద స్థిరపడింది. ఇక నాస్‌డాక్‌  16 పాయింట్లు(0.17 శాతం) తక్కువగా 9007 వద్ద ముగిసింది. వెరసి నాస్‌డాక్‌ 11 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. ట్రేడింగ్‌ చివర్లో పెరిగిన అమ్మకాలు ప్రభావం

Most from this category