News


అలహాబాద్‌ బ్యాంక్‌ లాభం రూ.128 కోట్లు

Thursday 1st August 2019
news_main1564636696.png-27465

  • తగ్గిన మొండి కేటాయింపుల భారం 
  • మొత్తం ఆదాయం రూ.4,747 కోట్లకు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.128 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.1,944 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. అంతకు ముందటి క్వార్టర్‌(గత క్యూ4లో) రూ.3,834 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. ఇక గత క్యూ1లో రూ.4,794  కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,747 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,590 కోట్ల నుంచి రూ.1,102 కోట్లకు తగ్గాయని వివరించింది. 
మిశ్రమంగా రుణ నాణ్యత..
బ్యాంక్‌ రుణ నాణ్యత మిశ్రమంగా నమోదైంది. స్థూల మొండి బకాయిలు పెరగ్గా, నికర మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ1లో 15.97 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 17.43 శాతానికి పెరిగాయని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది.  నికర మొండి బకాయిలు 7.32 శాతం నుంచి 5.71 శాతానికి తగ్గాయని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత క్యూ4లో స్థూల మొండి బకాయిలు 17.55 శాతంగా, నికర మొండి బకాయిలు 5.22 శాతంగా ఉన్నాయని పేర్కొంది.



You may be interested

అశోక్‌ లేలాండ్‌ లాభం రూ.275 కోట్లు

Thursday 1st August 2019

సగం తగ్గిన లాభం  రూ.600 కోట్లు సమీకరణ చెన్నై: హిందుజా గ్రూప్‌ ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.275 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.467 కోట్ల నికర లాభం వచ్చిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,194 కోట్ల నుంచి రూ.6,612 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్‌ ధీరజ్‌ జి. హిందుజా తెలిపారు.  ఇక పూర్తి

ఐఓసీ లాభం 47 శాతం డౌన్‌

Thursday 1st August 2019

తగ్గిన జీఆర్‌ఎమ్‌ ఇన్వెంటరీ లాభాలు కూడా తగ్గుముఖం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 47 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.7,092 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.3,738 కోట్లకు తగ్గిందని ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. ఒక్కో షేర్‌ పరంగా చూస్తే, నికర లాభం రూ.7.48 నుంచి రూ.4.07కు తగ్గిందని

Most from this category