News


హాంగ్‌కాంగ్‌లో ఆలీబాబా జోరు

Wednesday 27th November 2019
news_main1574825628.png-29881

  • 8 శాతం లాభంతో హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌ 
  •  పదేళ్లలో ఇదే అతి పెద్ద ఐపీఓ


హాంగ్‌కాంగ్‌: హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో చైనా ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం ఆలీబాబా షేర్లు శుభారంభం చేశాయి. ఆలీబాబా షేర్‌ అంచనాల కంటే తక్కువగానే 176 హాంగ్‌కాంగ్‌ డాలర్ల వద్ద లిస్టయినప్పటికీ, ఆ తర్వాత 8 శాతం లాభంతో 189.50 హాంగ్‌కాంగ్‌ డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్ట ‍స్థాయిని తాకింది. చివరకు 6 శాతం లాభంతో 187.50 హెచ్‌కే డాలర్ల వద్ద ముగిసింది. ఆలీబాబా 20వ వార్షికోత్సవం సందర్భంగా హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్ట్‌ కావడం ఒక మైలురాయని కంపెనీ సీఈఓ డేనియల్‌ జాంగ్‌ వ్యాఖ్యానించారు. 

పదేళ్లలో అది పెద్ద ఐపీఓ...
ఐపీఓలో భాగంగా ఆలీబాబా కంపెనీ 50 కోట్ల షేర్లను ఆఫర్‌ చేసి 8,800 కోట్ల హాంగ్‌కాంగ్‌ డాలర్లు(1,100 కోట్ల డాలర్లు-రూ.77,000 కోట్లు) సమీకరించింది. హాంగ్‌కాంగ్‌లో గత పదేళ్లలో ఇదే అతి పెద్ద ఐపీఓ. హాంగ్‌కాంగ్‌లో అలజడులు చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో ఆలీబాబా షేర్‌ లిస్ట్‌ కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. 

2013లోనే ప్రయత్నాలు....
2013లోనే ఈ కంపెనీని హాంగ్‌కాంగ్‌లో లిస్ట్‌ చేయాలని అప్పటి సీఈవో జాక్‌మా ప్రయత్నించారు. డైరెక్టర్ల బోర్డ్‌పై జాక్‌మా నియంత్రణ తమ నిబంధనలకు విరుద్ధమని హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలను సవరించాలని జాక్‌ మా విన్నపాన్ని పట్టించుకోలేదు. దీంతో 2014లో ఆలీబాబాను జాక్‌మా న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్ట్‌ చేశారు. ఆ తర్వాత హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ తన నిబంధనలను సవరించింది. ఆలీబాబా రాకతో మరిన్ని టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు ఈ ఎక్స్చేంజ్‌లో లిస్ట్‌ కాగలవని అంచనా. 



You may be interested

హైదరాబాద్‌లో ఇంటెల్‌ అభివృద్ధి కేంద్రం

Wednesday 27th November 2019

వారంలో ప్రారంభం తొలి దశలో వంద మందికి ఉద్యోగాలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్‌ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మాదాపూర్‌లోని సాలార్పూరియా సత్త్వా నాలెడ్జ్‌ సిటీలో సాంకేతికత అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. 5–6 అంతస్తుల్లో, సుమారు 3 లక్షల చ.అ.ల్లో ఉండే ఈ కేంద్రాన్ని వచ్చే వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ కేంద్రం సీటింగ్‌ కెపాసిటీ 1,500 కాగా.. తొలి దశలో సుమారు

ము‍ద్రా రుణాలకు 'మొండి' భారం

Wednesday 27th November 2019

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆందోళన రుణ ఖాతాలపై ఓ కన్నేసి ఉంచాలి బ్యాంకులకు ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్‌ జైన్‌ సూచన  ముంబై: ముద్రా రుణాలకు సంబంధించి మొండిబాకీలు గణనీయంగా పెరుగుతున్నాయని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యుటీ గవర్నర్‌ ఎంకే జైన్‌ హెచ్చరించారు. నిలదొక్కుకోలేని రుణాల వృద్ధితో మొత్తం వ్యవస్థకే ముప్పు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో ఇటువంటి లోన్స్‌పై ఓ కన్నేసి ఉంచాలని, నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. "ముద్రా రుణాలతో చాలా మంది లబ్ధిదారులు పేదరికం

Most from this category