News


భారత ఈ-కామర్స్‌లోకి యూసీవెబ్‌

Friday 6th September 2019
news_main1567740879.png-28226

న్యూఢిల్లీ: చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ తాజాగా భారత ఈ-కామర్స్‌ వ్యాపార విభాగంలో ప్రవేశించాలని యోచిస్తోంది. అనుబంధ సంస్థ యూసీవెబ్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. యూసీవెబ్ గ్లోబల్ బిజినెస్ వైస్‌ ప్రెసిడెంట్ హుయాన్‌ యాంగ్ ఈ విషయాలు తెలిపారు. అయితే, ఈ-కామర్స్‌ విభాగంలోకి తమ ఎంట్రీతో పేటీఎంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయన చెప్పారు. ఈ-కామర్స్‌ చాలా విస్తృతమైనదని, తమకు అనుకూల వ్యాపార భాగస్వాములతో.. తగిన ఉత్పత్తుల విభాగాలను ఎంచుకుంటామని, పేటీఎంతో పోటీ పడబోమని యాంగ్ చెప్పారు. ఆలీబాబా గ్రూప్‌నకు పేటీఎంలో 30.15 శాతం, మరో ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌లో 3 శాతం వాటాలు ఉన్నాయి. యూసీవెబ్‌.. ఆన్‌లైన్లో సినిమాల విక్రయం కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు యాంగ్ చెప్పారు. యూసీవెబ్‌నకు చెందిన యూసీ బ్రౌజర్‌ 2009 నుంచి భారత్‌లో అందుబాటులో ఉంది. యూసీవెబ్ వర్గాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా (చైనా మినహా) 110 మంది యూజర్లు ఈ బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా, ఇందులో సగభాగం యూజర్లు భారత్ నుంచే ఉన్నారు. 



You may be interested

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ చేతికి భూషన్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌

Friday 6th September 2019

  రూ.19,700 కోట్ల బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం న్యూఢిల్లీ: సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ రూ.19,700 కోట్లతో భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ కొనుగోలుకు వేసిన బిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.47,158 కోట్ల మేర భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు రాకపోవడంతో రుణాలిచ్చిన సంస్థలు కమిటీగా ఏర్పడి ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడం, ఆ తర్వాత బిడ్లను

ఇక రిటైల్‌లోనూ 59 నిమిషాల్లో...

Friday 6th September 2019

వ్యక్తిగత, గృహ రుణాలు ఇకపై మరింత సులభతరం త్వరలో ఆటో పరిశ్రమకు విస్తరణ ఇప్పటి వరకూ చిన్న పరిశ్రమలకే ఈ ప్రయోజనం న్యూఢిల్లీ: ‘59 నిమిషాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) రుణాలు’ పోర్టల్‌ సేవలు రిటైల్‌ రుణాలకూ విస్తరించడం జరిగింది. రిటైల్‌ రుణ లభ్యతకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకు ఈ పోర్టల్‌ ఇకపై అందుబాటులో ఉండనుంది. త్వరలో ఆటో రుణాలకు సంబంధించి

Most from this category