News


అలీబాబా చైర్మన్‌ ‘జాక్‌ మా’ రాజీనామా

Wednesday 11th September 2019
news_main1568174086.png-28297

  • 55వ పుట్టిన రోజు నాడు నిర్ణయం

బీజింగ్‌: చైనాలో ఆన్‌లైన్‌ రిటైలింగ్‌ బూమ్‌ను సృష్టించి, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్‌ కంపెనీ అలీబాబాను సృష్టించిన జాక్‌మా, చైర్మన్‌ పదవి నుంచి మంగళవారం తప్పుకున్నారు. చైనా-అమెరికా మధ్య వాణిజ్య పోరుతో పరిశ్రమ అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన తప్పుకోవడం ఆసక్తిగా మారింది. చైనాలోనే సంపన్నుడైన జాక్‌మా సరిగ్గా 55వ పుట్టిన రోజు నాడే అలీబాబా చైర్మన్‌ పదవిని వదులుకున్నారు. నిజానికి ఏడాది క్రితం ఆయన ప్రకటించిన భవిష్యత్తు ‍ప్రణాళికలో భాగమే ఇది. 36 మంది సభ్యులతో కూడిన అలీబాబా పార్టనర్‌షిప్‌లో ఆయన సభ్యుడిగా కొనసాగుతారు. ఈ గ్రూపు మెజారిటీ డైరెక్టర్లను అలీబాబాకు నామినేష్‌ చేస్తుంటుంది. చైనా ఎగుమతులను అమెరికన్‌ రిటైలింగ్‌ కంపెనీలకు అనుసంధానించేందుకు అలీబాబాను 1999లో జాక్‌మా స్థాపించారు. చైనాలో వినియోగదారుల నుంచి ఉన్న అధిక డిమాండ్‌ను గుర్తించి, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యాపారాల్లోకీ ఆయన గ్రూపును విస్తరింపజేశారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అలీబాబా గ్రూపు ఆదాయం 42 శాతం పెరిగి 16.7 బిలియన్‌ డాలర్లుగా, లాభం 145 శాతం వృద్ధి తో 3.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు ఆ సంస్థ గతంలో ప్రకటించింది. గతేడాది అలీబాబా ప్లాట్‌ఫామ్‌పై 853 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులు అమ్ముడయ్యాయి. ఈ సంస్థ వ్యాపారంలో దేశీయ వాటా 66 శాతంగా ఉంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం కారణంగా, చైనాకు దిగుమతులు భారంగా మారాయి. 2019 మొదటి క్వార్టర్‌లో ఆన్‌లైన్‌ పరిశ్రమ విక్రయాలు 17.8 శాతానికి తగ్గాయి. 2018 ఇదే కాలంలో 23.9 శాతం వృద్ది ఉండడం గమనార్హం. అలీబాబా గ్రూపు కంపెనీల్లో టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, బైదు డాట్‌ కామ్‌ తదితర సంస్థలు కూడా ఉన్నాయి. You may be interested

భవిష్యత్తు ‘షా’లకు బాటలు వేస్తా

Wednesday 11th September 2019

స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటు పదేళ్లలో పది కోట్ల మందికి ఉపాధి వినూత్న ఆలోచనలున్న యువతకు మార్గదర్శకం ఎంసీఎక్స్‌ వ్యవస్థాపకుడు జిగ్నేషా వెల్లడి న్యూఢిల్లీ: ఎంసీఎక్స్‌ వ్యవస్థాపకుడు జిగ్నేష్‌ షా (52) త్వరలో రెండో విడత ప్రయాణం మొదలుపెట్టనున్నారు. వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కల్పించేందుకు మార్గదర్శిగా వ్యవహరించాలన్న ప్రణాళికలతో ఉన్నారు. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌లో వంద రెట్లు అధిక వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే ఓ స్టార్టప్‌ ప్లాట్‌ఫామ్‌ను

లాభాల ప్రారంభం

Wednesday 11th September 2019

ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 105 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 37,251 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల పెరుగుదలతో 11,028 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

Most from this category