News


64 శాతం పెరిగిన అలెంబిక్‌ ఫార్మా లాభం

Tuesday 23rd October 2018
news_main1540270613.png-21387

న్యూఢిల్లీ: అలెంబిక్‌ ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం జూలై- సెప్టెంబర్‌ క్వార్టర్లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.200 కోట్ల నికర లాభాన్ని  సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.122 కోట్ల నికర లాభం వచ్చిందని, అప్పటితో పోలిస్తే 64 శాతం వృద్ధి సాధించామని అలెంబిక్‌ ఫార్మా తెలిపింది. విదేశాల్లో అమ్మకాలు జోరుగా ఉండటం దీనికి కారణమని కంపెనీ ఎమ్‌డీ ప్రణవ్‌ అమిన్‌ చెప్పారు. గత క్యూ2లో రూ.789 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 43 శాతం వృద్ధితో రూ.1,127 కోట్లకు పెరిగింది. అంతర్జాతీయ ఫార్ములేషన్స్‌ అమ్మకాలు రూ.262 కోట్ల నుంచి రూ.587 కోట్లకు పెరిగాయి. అమెరికాలో మార్కెట్లో ఒక ఔషధం కొరత ఏర్పడిందని, ఫలితంగా ఉత్పన్నమైన సరఫరా అవకాశం కారణంగా అధిక లాభాలు వచ్చాయని ప్రణవ్‌ వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అలెంబిక్‌ ఫార్మా షేర్‌ 4.6 శాతం క్షీణించి రూ.580 వద్ద ముగిసింది. 



You may be interested

దొడ్ల డెయిరీ ఐపీఓకు సెబీ ఓకే

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: దొడ్ల డెయిరీ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ ఐపీఓతో పాటు మరో మూడు కంపెనీలు- ఆఫిల్‌ ఇండియా, చాలెట్‌ హోటల్స్‌, హర్ష ఇంజినీర్స్‌ ఐపీఓలకు కూడా పచ్చజెండా ఊపింది.  దీంతో ఈ ఏడాది ఇప్పటిదాకా సెబీ అనుమతించిన ఐపీఓల సంఖ్య 64కు పెరిగింది.  దొడ్ల డెయిరీ ఐపీఓ @ రూ.500 కోట్లు  దక్షణ భారతదేశంలో ప్రముఖ డెయిరీ... దొడ్ల

టాప్‌10లో ఏడు ‘మారుతీ’ కార్లు

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) అమ్మకాల్లో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. పీవీ విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతున్న ఈ సంస్థ.. సెప్టెంబరు అమ్మకాల్లో మరో రికార్డును సొంతం చేసుకుంది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. గత నెల పీవీ విక్రయాల టాప్‌ 10 జాబితాలో ఏకంగా 7 వాహనాలు ఈ కంపెనీకి చెందినవే ఉన్నట్లు

Most from this category