News


ఎయిర్‌టెల్‌ ‘ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్’ సేవలు ప్రారంభం

Thursday 12th September 2019
news_main1568260846.png-28321

  • 1జీబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ధర రూ. 3,999

న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌..  ‘ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్’ పేరుతో అపరిమిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను బుధవారం ప్రారంభించింది. గృహాలు, ఎస్‌ఓహెచ్‌ఎం (స్మాల్ ఆఫీస్ హోమ్ ఆఫీస్), చిన్న వాణిజ్య సంస్థల కోసం రూ. 3,999 నెలవారీ చందాకే తాజా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఇండోర్, జైపూర్, అహ్మదాబాద్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్, చండీగఢ్ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ ప్రయోజనాలు ఉన్నట్లు వివరించింది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్‌ ల్యాండ్‌లైన్‌ కాల్స్‌ ఉచితంగా అందిస్తోంది. You may be interested

ఈనెల్లోనే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ సేల్‌

Thursday 12th September 2019

సెప్టెంబర్‌ 29న ప్రారంభం న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. ఈనెలాఖరులోనే మరోసారి 'ది బిగ్ బిలియన్ డేస్‌' సేల్ ఆఫర్‌ను ప్రారంభించనుంది. ఆరు రోజులపాటు కొనసాగే తాజా ఆఫర్‌.. సెప్టెంబర్‌ 29న ప్రారంభమై అక్టోబర్ 4 వరకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. గతంలో కంటే అధిక వస్తువులను ఈసారి ఆఫర్‌లో ఉంచనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఇందుకోసం అనేక బ్రాండ్లు, ఎంఎస్‌ఎంఈ, విక్రయదారులతో ఇప్పటికే ఒప్పందంకుదిరినట్లు తెలియజేసింది.

వృద్ధి కథ... బాలీవుడ్‌ సినిమాయే!

Thursday 12th September 2019

మందగమనం రూపంలో విలన్‌  8తో ముగిసే సంవ్సరాల్లో సంక్షోభాలు  చివరికి సుఖాంతమే  మందగమనంపై కోటక్‌ వ్యాఖ్యలు  ముంబై: మన దేశ వృద్ధి కధ అచ్చం బాలీవుడ్‌ సినిమాలాగానే ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌  చైర్మన్‌ ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్యానించారు. భారత్‌లోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు సినిమాను తలపించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆరంభంలో ప్రేమ కధలాగానే వృద్ది జోరుగానే మొదలైందని, ఆ తర్వాత మందగమనం రూపంలో విలన్‌ ఎదురయ్యాడని, దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని వివరించారు.

Most from this category