News


ఏపీ, తెలంగాణలో ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌

Tuesday 24th December 2019
news_main1577160083.png-30398

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- టెలికం రంగ సంస్థ ఎయిర్‌టెల్‌ వాయిస్‌ ఓవర్‌ వైఫై సర్వీస్‌ ‘ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌’ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌కు విస్తరించింది. అలాగే ముంబై, కోల్‌కత, కర్నాటక, తమిళనాడులోనూ ఈ సేవలను పరిచయం చేసింది. వైఫై ఆధారంగా ఏదేని నెట్‌వర్క్‌కు టెల్కో గ్రేడ్‌ కాల్స్‌ చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత. వినియోగదార్ల నుంచి అదనంగా ఎటువంటి చార్జీ వసూలు చేయబోమని కంపెనీ ప్రకటించింది. ఇల్లు, కార్యాలయంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ సరిగా లేనప్పుడు వైఫై కాలింగ్‌ చక్కని ప్రత్యామ్నాయం అని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కొన్ని మొబైల్‌ కంపెనీల మోడల్స్‌కు మాత్రమే వైఫై కాలింగ్‌ ఫీచర్‌ ఉంది. ఈ ఫీచర్‌ను జోడించేందుకు ఇతర కంపెనీలతో ఎయిర్‌టెల్‌ చర్చిస్తోంది. వైఫై కాలింగ్‌ ప్రస్తుతానికి ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌ ఫైబర్‌ హోం బ్రాడ్‌బ్యాండ్‌పై పనిచేస్తుంది. త్వరలో ఇతర కంపెనీల బ్రాడ్‌బ్యాండ్‌, వైఫై హాట్‌స్పాట్స్‌పైనా పనిచేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ తొలుత ఢిల్లీలో ఈ నెల ప్రారంభంలో అందుబాటులోకి వచ్చింది. కాగా, రిలయన్స్‌ జియో సైతం వాయిస్‌ ఓవర్‌ వైఫై సేవలను కేరళ, మహారాష్ట్ర, కోల్‌కతలో ప్రవేశపెట్టినట్టు సమాచారం.



You may be interested

పర్యటనకు ఛలో హైదరాబాద్‌

Tuesday 24th December 2019

ఈ నగరానికి పెరుగుతున్న దేశీ పర్యాటకులు  బుకింగ్‌డాట్‌కామ్‌ సర్వే వెల్లడి  ముంబై: దేశీయ పర్యాటకులు ఈ ఏడాది హైదరాబాద్‌కు జై కొట్టారు. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్‌కే అగ్రతాంబూలం దక్కిందని బుకింగ్‌డాట్‌కామ్‌  సర్వేలో వెల్లడైంది. ఇక దేశీయ పర్యాటకుల అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో దుబాయ్‌ అగ్రస్థానంలో నిలిచిందని ఈ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్‌ 30 వరకూ పర్యాటక, వసతి పరంగా జరిగిన బుకింగ్స్‌ ఆధారంగా ఈ

మంగళవారం యాక్టివ్‌ స్టాక్స్

Tuesday 24th December 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ట్రేడింగ్‌లో ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు చూద్దాం.. సొలారా యాక్టివ్‌ ఫార్మా: స్ర్టైడ్స్‌ కెమికల్స్‌ కంపెనీతో విలీన ప్రతిపాదనకు జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేసినట్లు సొలారా యాక్టివ్‌ ఫార్మా తాజాగా పేర్కొంది. చాలెట్‌ హోటల్స్‌: హయత్‌ ఇండియా కన్సల్టెన్సీతో ఫ్రాంచైజీ, తదితర పలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు చాలెట్‌ హోటల్స్‌ తెలియజేసింది. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌: దాదాపు 3 కోట్ల క్యుములేటివ్‌ రీడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల(సీపీఆర్‌ఎస్‌) జారీకి అనుమతి

Most from this category