News


ఏజీఆర్ బాకీలు నేడు చెల్లించనున్న టెల్కోలు

Monday 17th February 2020
news_main1581908446.png-31835

  • చెల్లించే మొత్తాన్ని బట్టి టెలికం శాఖ తదుపరి చర్యలు

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరిన్ని కఠిన చర్యల ఎదుర్కొవాల్సిన పరిస్థితి రాకుండా.. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీలను భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్‌ సోమవారం చెల్లించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మూడు సంస్థలు టెలికం శాఖకు ఈ విషయం తెలియజేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆయా సంస్థలు చెల్లించే మొత్తాన్ని బట్టి టెలికం శాఖ తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయని వివరించాయి. సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌) లెక్కల ప్రకారం టెల్కోలు సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. జనవరి 23లోగా వీటిని కట్టేయాలంటూ గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఆదేశించింది. రిలయన్స్ జియో కట్టేయగా.. మిగతా సంస్థలు మాత్రం ఈ ఉత్తర్వులను సమీక్షించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అయితే, కంపెనీలు ఇప్పటిదాకా కట్టకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా .. టెల్కోలు, టెలికం శాఖ అధికార్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఫిబ్రవరి 20లోగా రూ. 10,000 కోట్లు కడతామంటూ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. తాము కట్టాల్సిన బకాయిలను మదింపు చేస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఎయిర్‌టెల్ దాదాపు రూ. 35,586 కోట్లు, వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 53,000 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ రూ. 13,800 కోట్లు, బీఎస్‌ఎన్ఎల్ రూ. 4,989 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ. 3,122 కోట్లు కట్టాల్సి ఉంది. 



You may be interested

బంగారం దిగుమతులు 9 శాతం డౌన్‌

Monday 17th February 2020

తొలి పది నెలల్లో 24.64 బిలియన్‌ డాలర్ల మేర న్యూఢిల్లీ: ఆర్థిక రంగ మందగమన ప్రభావం బంగారం దిగుమతులపైనా చూపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల కాలంలో (2019 ఏప్రిల్‌ నుంచి 2020 జనవరి వరకు) 24.64 బిలియన్‌ డాలర్ల విలువైన (రూ.1.74 లక్షల కోట్లు) బంగారం మన దేశంలోకి దిగుమతి అయింది. కానీ, అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో జరిగిన బంగారం దిగుమతులు 27 బిలియన్‌

అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్‌..

Monday 17th February 2020

కరోనా వైరస్‌ పరిణామాలు కీలకం గురువారం ఎఫ్‌ఓఎంసీ, ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు ముంబై: కోవిడ్‌–19(కరోనా వైరస్‌) తాజా పరిణామాలు, ఏజీఆర్‌ అంశం వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్‌ గురించి ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి.

Most from this category