News


ఆర్‌కామ్‌ ఆస్తుల కోసం ఎయిర్‌టెల్‌ రూ.9500 కోట్ల బిడ్‌!

Friday 29th November 2019
news_main1575004018.png-29946

రుణాల ఊబిలో కూరుకుపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం‍టున్న రిలయన్స్‌ కమ్యునికేషన్స్‌ ఆస్తులను కొనుగోలు చేసేందుకు రూ. 9,500 కోట్ల విలువైన షరతులతో కూడిన బిడ్లను టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ సమర్పించిందని టెలికాం పరిశ్రమకు చెందిన ఓ అధికారి తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు వీఎఫ్‌ఎస్‌ఐ హోల్డింగ్స్‌ ప్రై., యూవీ అసెట్‌ రికనస్ట్రక్షన్‌ కంపెనీ కూడా తమ బిడ్లను సీఓసీ(క్రెడిటర్స్‌ కమిటీ)కి అందించాయి. ‘మిగిలిన కంపెనీల కంటే భారతీ ఎయిర్‌టెల్‌ రూ. 9,500 కోట్లతో అధికంగా బిడ్‌ వేసిన కంపనీగా ఉందని అంచనావేస్తున్నా. సీఓసీ శుక్రవారం దీని ఫలితాన్ని ప్రకటించనుంది’ అని ఆ అధికారి తెలిపారు. బిడ్లను సమర్పించడానికి మరికొంత సమయం ఇవ్వమని రిలయన్స్‌ జియో కోరినప్పటికి కంపెనీ అంగీకరించలేదు. ఆర్‌కామ్‌ డేటా సెంటర్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ కొనుగోలు చేయాలని ప్రయత్నించిన ఐ స్వేర్డ్‌ క్యాపిటల్‌ కూడా తమ బిడ్లను దాఖలు చేయకపోవడం గమనార్హం. 
  రిలయన్స్‌ కమ్యునికేషన్స్‌ సెక్యుర్డ్‌ రుణాలు రూ. 33,000 కోట్లుగా ఉండగా, రుణదాతలు అగష్టు నెలలో రూ. 49,000 కోట్లను డిమాండ్‌ చేశాయి. ఆర్‌కామ్‌పై దివాలా పక్రియ ప్రారంభం కాకముందే, రూ. 14,000 కోట్ల విలువైన 122 ఎంహెచ్‌జెడ్‌(మెగా హెడ్జ్‌) స్పెక్ట్రమ్‌ను, రూ. 7,000 కోట్లు విలువ చేసే టవర్‌ వ్యాపారాలను, రూ. 3,000 కోట్లు విలువ చేసే ఆప్టికల్‌ ఫైబర్‌ నెటవర్క్‌ను, రూ. 4,000 కోట్ల విలువైన డేటా సెంటర్‌ను విక్రయించేందుకు ప్రయత్నాలు చేసింది. ఎన్‌సీఎల్‌టీ తీర్పు ప్రకారం, ఈ కంపెనీ దివాలా పక్రియను వచ్చే జనవరి 10 నాటికి రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ పూర్తి చేయాల్సి ఉంది. కాగా రుణాలను చెల్లించేందుకు ఆర్‌కామ్‌ ముందు తన ఆస్తులను రిలయన్స్‌ జియోకు విక్రయించేందుకు ప్రయత్నించింది. కానీ ఆర్‌కామ్‌ పాత రుణాలను కూడా జియో మీద పడే అవకాశం ఉండడంతో ఈ కొనుగోలు ఒప్పందాన్ని జియో రద్దు చేసుకుంది. ఆ తర్వాత ఆర్‌కామ్‌, స్వీడన్‌ కంపెనీ ఎరిక్సన్‌ బకాయిలను చెల్లించడంలో విఫలమవ్వడంతో ఈ కంపెనీపై దివాలా పక్రియ ప్రారంభమైంది.  ఈ ఆర్థిక సంవత్సం ద్వితియ త్రైమాసికంలో ఆర్‌కామ్‌ రూ. 30,142 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ అత్యధిక త్రైమాసిక నష్టాన్ని ప్రకటించిన కంపెనీగా నిలిచింది. దీని తర్వాత ఆర్‌కామ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబాని తన పదవి నుంచి వైదొలిగేందుకు ప్రయత్నించినప్పటికి, సీఓసీ ఆయన రాజీనామాను తిరస్కరించడం గమనార్హం.You may be interested

భారతి ఇన్‌ఫ్రాటెల్‌ 10 శాతం అప్‌

Friday 29th November 2019

వరుసగా రెండోరోజూ భారతీ ఇన్ఫ్రాటెల్‌ షేరు లాభాల బాట పట్టింది. నేడు ఈ షేరు రూ.248.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి ఈ షేరుకు ట్రేడర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో 10శాతానికి పైగా లాభపడి రూ.282.80 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:20ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.256.50)తో పోలిస్తే 7.76శాతం లాభంతో రూ.276.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డిసెంబర్‌01 నుంచి టెలికాం

స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 29th November 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు లాభంతో 1,463.75డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. హాంగ్‌కాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవారికి మద్దతునిచ్చే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తాజాగా సంతకం చేశారు. దీనికి ప్రతిగా చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడంతో నేడు

Most from this category