News


భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాలు రూ.1,035 కోట్లు

Wednesday 5th February 2020
news_main1580872304.png-31510

  • ఏజీఆర్‌ వడ్డీ కేటాయింపుల భారం 
  • 9 శాతం వృద్ధితో రూ.21,947 కోట్లకు ఆదాయం
  • రూ.135కు పెరిగిన ఏఆర్‌పీయూ

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.1,035 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి) బకాయిల వడ్డీకి సంబంధించిన కేటాయింపులు, 3జీ నెట్‌వర్క్‌ పరికరాలపై తరుగుదల, తదితర అంశాల కారణంగా ఈ నష్టాలు వచ్చాయని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. కంపెనీకి వరుసగా మూడో క్వార్టర్‌లోనూ నష్టాలు వచ్చాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.86 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది.  ఆదాయం మాత్రం రూ.20,231 కోట్ల​ నుంచి 9 శాతం వృద్ధితో రూ.21,947 కోట్లకు పెరిగిందని తెలిపింది. గత క్యూ3లో రూ.128గా ఉన్న ఏఆర్‌పీయూ(ఒక్కో వినియోగదారుడి నుంచి ఆర్జించే సగటు రాబడి) ఈ క్యూ3లో రూ.135కు పెరిగింది. మరిన్ని వివరాలు.....

భారత ఆదాయం 7 శాతం వృద్ధి...
భారత కార్యకలాపాల ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.15,797 కోట్లకు పెరిగింది. ఆఫ్రికా కార్యకలాపాల ఆదాయం 14 శాతం వృద్ధి చెందాయి. డేటా, కాల్‌ చార్జీలను 50 శాతం వరకూ పెంచడం సానుకూల ప్రభావం చూపించింది. డేటా ట్రాఫిక్‌ 73 శాతం పెరిగింది. ఈ క్యూ3లో అత్యధికంగా (2.1 కోట్ల మంది) కొత్తగా 4జీ వినియోగదారులయ్యారు. కాగా ఈ క్యూ2లో భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.23,045 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక నష్టాలు.  
టారిఫ్‌ల సవరణ మంచిదే....
టెలికం టారిఫ్‌ల సవరణ మంచి పరిణామమని భారతీ ఎయిర్‌టెల్‌ ఎమ్‌డీ, సీఈఓ(ఇండియా, సౌత్‌ ఏషియా) గోపాల్‌ విట్టల్‌ పేర్కొన్నారు. దీంతో టెలికం పరిశ్రమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని వివరించారు. 



You may be interested

ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్‌

Wednesday 5th February 2020

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి బిడ్ చేసే యోచన బిడ్డింగ్ నిబంధనలకు అనుగుణంగా వ్యూహాలు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్‌ఏషియా ఇండియాలో  విలీన ప్రతిపాదన ఎయిర్‌ఏషియా చీఫ్‌ టోనీతో చర్చలు ముంబై: దాదాపు 87 ఏళ్ల క్రితం తాము ప్రారంభించిన విమానయాన సంస్థ .. ఎయిరిండియాను తిరిగి దక్కించుకునేందుకు టాటా గ్రూప్ గట్టిగా కసరత్తు చేస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఎయిరిండియా కోసం బిడ్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా నిబంధనలకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుంటోంది. ఎయిరిండియా

అంతలోనే అంత ర్యాలీ..? తర్వాత ఏంటి..?

Wednesday 5th February 2020

స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ రోజు గత శనివారం భారీ నష్టాల తర్వాత.. మంగళవారం భారీ లాభాల వర్షం కురవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి..? ఇంత ర్యాలీ చేసిన తర్వాత తదుపరి సూచీల గమనం ఏంటి? అన్న దానిపై నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...   చమురు ధరలు తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద సానుకూలం. మన విదేశీ మారక నిల్వలు త్వరలోనే అర ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటనున్నాయి. మోస్తరు ద్రవ్యోల్బణం

Most from this category