News


ఎయిర్‌టెల్‌ నుంచి వై-ఫై కాలింగ్‌ సేవలు

Saturday 11th January 2020
news_main1578713639.png-30847

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌.. దేశవ్యాప్తంగా వై-ఫై కాలింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు శుక్రవారం ప్రకటించింది. నూతన సేవల ఆధారంగా ఇతర వై-ఫై నెట్‌వర్క్‌లను కూడా వినియోగించుకుని కాల్స్‌ చేయవచ్చని, దీంతో పాటు ఇళ్లల్లో లేదా ఆఫీసుల్లో కాల్స్‌ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్‌టీఈ నుంచి వై-ఫైకి మారవచ్చని వివరించింది. ఇందుకు కస్టమర్ల నుంచి ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదని స్పష్టంచేసింది. పైలెట్‌ ప్రొజెక్ట్‌ కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న సంస్థ సేలవకు విశేష స్పందన లభించిందని, వై-ఫై కస్టమర్ల సంఖ్య 10 లక్షలను అధిగమించిందని ఒక ప్రకటన ద్వారా వెల్లడించిన కంపెనీ.. తాజాగా ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. దాదాపు 16 బ్రాండ్లకు చెందిన 100కి పైగా స్మార్ట్‌ఫోన్లలో ఈ సేవల వినియోగానికి అవకాశం ఉంది. ఇక ఇటీవలే రిలయన్స్ జియో సైతం ఈ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చింది. 



You may be interested

150 మిలియన్‌ డాలర్లు సమీకరించిన జొమాటో

Saturday 11th January 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గుర్గావ్‌కు చెందిన ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌ జొమాటో తాజాగా 150 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌ అనుబంధ సంస్థ యాంట్‌ ఫైనాన్షియల్‌ ఈ పెట్టుబడులు పెట్టిందని కంపెనీ తెలిపింది. టెక్నాలజీ, కొత్త ప్రాంతాల్లో విస్తరణతో పాటూ ప్రధాన నగరాల్లో మార్కెట్‌ వాటాను పెంచేందుకు ఈ నిధులను వినియోగిస్తామని పేర్కొంది. తాజా నిధుల సమీకరణతో జొమాటోలో ప్రధాన వాటాదారు ఇన్ఫో ఎడ్జ్‌

పరిశ్రమలు మళ్లీ ప్లస్‌లోకి...

Saturday 11th January 2020

నవంబర్‌లో 1.8 శాతం వృద్ధి మూడు నెలల తర్వాత  క్షీణత నుంచి బయటకు.. ‘తయారీ’ రంగం రికవరీ న్యూఢిల్లీ: భారత్‌ పారిశ్రామిక రంగం నవంబర్‌లో వెలుగురేఖలు చూసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 1.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. భారత్‌ పారిశ్రామిక రంగం మూడు నెలల తర్వాత వృద్ధిబాటలోకి రావడం గమనార్హం. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో భారత్‌ పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధినమోదుకాకపోగా, క్షీణ రేటు నెలకొంది. మొత్తం సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ

Most from this category