News


ఐసీఐసీఐ లైఫ్‌తో ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ జట్టు

Monday 7th October 2019
news_main1570421057.png-28748

ప్రైవేట్‌ రంగ జీవిత బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఐసీఐసీఐ ప్రూ లైఫ్‌ జీవిత బీమా పాలసీలతో పాటు ఇతరత్రా పొదుపు పథకాలను కూడా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులు సులభతరంగా పొందేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. చౌక ప్రీమియంలతో మెరుగైన పథకాలను అందించడం, టెక్నాలజీని వినియోగించుకుని కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడంపై దృష్టి పెడుతున్నట్లు ఐసీఐసీఐ ప్రూ లైఫ్‌ ఎండీ ఎన్‌ఎస్‌ కణ్ణన్‌ తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజానీకానికి మెరుగైన బీమా పథకాలను అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సీఈవో అనుబ్రత బిస్వాస్‌ తెలిపారు. 
 



You may be interested

బ్యాంకులపై ఆంక్షలు... డిపాజిట్లు భద్రమేనా..?

Monday 7th October 2019

ఇటీవలే పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు ఒక ఖాతా నుంచి పరిమితంగా నగదు ఉపసంహరణ ఆరు నెలల పాటు ఇదే పరిస్థితి ఈ తరహా సందర్భాలపై అవగాహన తక్కువే బ్యాంకు దివాలా తీస్తేనే డిపాజిట్‌పై బీమా ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా రూ.లక్ష తగిన జాగ్రత్తలతోనే ఖాతాదారులకు రక్షణ  బ్యాంకుల్లో మన నగదు భద్రంగా ఉంటుందన్న భరోసాయే... వడ్డీ రాబడి తక్కువైనా కానీ ఇప్పటికీ చాలా మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయడానికి కారణం. కావాలనుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా డిపాజిట్‌ను వెనక్కి

అన్ని కాలాల్లోనూ పెట్టుబడులకు అనుకూలం..!

Monday 7th October 2019

ఈక్విటీ మార్కెట్లలో సాధారణంగా అస్థిరతలు ఉంటుంటాయి. కానీ, కొన్ని సందర్భాల్లో ఇవి అసాధారణ స్థాయికి చేరుతుంటాయి. ముఖ్యంగా ఈ తరహా ఆటుపోట్లు, అనిశ్చిత పరిస్థితుల్లో మల్టీక్యాప్‌ విభాగం ఈక్విటీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటుంది. ఎందుకంటే ఈ విభాగంలోని మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు కేవలం ఒక విభాగానికే పరిమితం కాకుండా.. చిన్న, మధ్య, పెద్ద స్థాయి ఇలా అన్ని రకాల మార్కెట్‌ విలువతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటుతో ఉంటాయి. మార్కెట్‌

Most from this category