News


ఎయర్‌సెల్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మేందుకు ప్రయత్నాలు..

Saturday 15th June 2019
news_main1560578185.png-26318

ఇతర టెలికాం కంపెనీలతో చర్చిస్తున్నా యూవీఏఆర్‌సీఎల్‌
ఎయిర్‌సెల్‌ ప్రతిపాదిత కొనుగోలుదారు, రిజల్యూషన్‌ ప్రోఫెషనల్‌ యూవీ ఎసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కో. లిమిటెడ్‌(యూవీఏఆర్‌సీఎల్‌) దివాలా తీసిన ఎయిర్‌సెల్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మేందుకు భారతి ఎయిర్‌టెల్, వోడఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో టెలికాం కంపెనీలతో చర్చలు మొదలుపెట్టింది. ఇది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌(డీఓటీ) వైఖరికి వ్యతిరేకంగా ఉందని, టెలికాం స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వ వేలం పాట ద్వారానే విక్రయించాలని విశ్లేషకుల భావిస్తున్నారు. కాగా రుణదాతల కమిటీ(సీఓసీ) అమోదించిన రిజల్యూషన్‌ పద్దతి ద్వారా డీఓటీకి కేవలం 2-3 కోట్లువస్తాయి. అందుకే ఈ విధానానికి డీఓటీ సుముఖంగా లేదు. ఈ స్పెక్ట్రం వేలం ద్వారా కనీసం పదివేల కోట్ల రూపాయలు ఆర్జించాలని డీఓటీ ఆశించింది.  ఇదే మొత్తాన్ని ఇవ్వాలని కోరింది. కానీ రిజల్యూషన్‌ ప్రోపెషనల్‌ డిలాయిట్‌ రూ.2,000కోట్లకు ఆమోదం తెలిపింది. మరోవైపు అసలు స్పెక్ర్టంను కంపెనీలు అమ్ముకోవచ్చా? అనే విషయంపై ప్రభుత్వ ధోరణి కీలకం కానుంది. స్పెక్ట్రమ్‌ను వేలం పాట ద్వారానే అది కూడా కొంత సమయ వ్యవధి వరకు మాత్రమే టెల్కోలకు కేటాయింస్తోందని, అది టెలికాం కంపెనీల సొంత ఆస్థికాదని ప్రభుత్వం భావిస్తోంది.

ఎయిర్‌సెల్‌ స్పెక్ట్రమ్‌లోని 900 మెగా హెడ్జ్, 1800మె.హె అమ్మేందుకు ఇతర టెలికాం కంపెనీలతో ప్రాథమిక చర్చలను యూవీఏఆర్‌సీఎల్‌ ఇప్పటికే ప్రారంభించింది.  4జీ నెటవర్క్‌ని విస్తరించడంలో భాగంగా 2026 వరకు చెల్లుబాటయ్యే స్పెక్ట్రమ్‌ను కొనేందుకు టెలికాం కంపెనీలు ఆసక్తిని చూపించవచ్చు.  కానీ అది కూడా చివరి వేలం పాట రేటు కన్నా 20-25శాతం రాయితీతో అని విశ్లేషకులు అంటున్నారు.  దేశంలో ఎక్కడైన  ఎయిర్‌సెల్‌ స్పెక్ట్రమ్‌ విలువ రూ.1,100- 2,000 కోట్లుంటుందని ఎయిర్‌ సెల్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రెబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)కు తెలిపింది.  డీఓటీతో కలిపి కార్యచరణ రుణదాతల కోసం రూ.100కోట్ల కంటే తక్కువనే సీఓసీ ఆమోదించిన రిజల్యుషన్‌ పద్ధతిలో కేటాయించారని విశ్లేషకులంటున్నారు. ‘ఎయిర్‌సెల్‌ ఆస్థి విలువ వేగంగా  తగ్గుతోంది. ఇలాంటి సమయంలో కార్యచరణ రుణదాతలు, ఆర్థిక రుణదాతలకు సంస్థను పునరుద్ధరించడానికి చాలా తక్కువ అవకాశం ఉంది’ అని వీరు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక రుణదాతలు గరిష్ఠంగా రూ.3000కోట్లు లేదా ఆసురక్షిత రుణాలలో 20శాతం మాత్రమే పునరుద్ధరించగలరని అన్నారు. ఎయిర్‌సెల్‌ స్పెక్ట్రమ్‌ను తిరిగి పూల్‌కు జోడించి మార్కెట్‌రేటు ప్రకారం వేలం పాటకి వెళ్లడానికి డీఓటీ ఎన్‌సీఎల్‌టీ ముందు వాదించనుంది. 

డీఓటీ బకాయిలను రికవరి చేయడం చాలా అవసరం కానీ సంస్థ ఆస్థి విలువ తగ్గుతున్నప్పుడు అది కష్టసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్‌సెల్‌ స్పెక్ట్రమ్‌తో పాటు, ఎంటరప్రైజ్‌ వ్యాపారాలు, ఫైబర్, భూములు, ఇన్ఫాస్ట్రక్చర్‌లో  ఆస్తి ఉంది.  ప్రభుత్వం ఏవిధంగా డబ్బును రికవరి చేయగలదో ప్రపోజల్స్‌ను డీఓటీకి పంపమని ప్రోఫెషనల్‌ రిజల్యూషన్‌ డిలాయిట్‌ని సోమవారం ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. రూ.20,000 కోట్ల బకాయిలను చెల్లించంలేక పోవడంతో 2018 మార్చిలో  ఎయిర్‌సెల్‌ దివాలాకు వచ్చింది. ఎయిర్‌సెల్‌ పగ్గాలను యూవీఏఆర్‌సీఎల్‌కు అప్పగించమని సీఓసీ నిర్ణయించడం తెలిసిందే. దీంతో ఇప్పుడా దివాలా ప్రోసెస్‌ చివరి దశకు చేరుకుంది. గత ఏడాది నుంచి డిలాయిట్‌ ద్వారానే సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి.  రిలయన్స్‌ కమ్యునికేషన్స్‌ కూడా స్పెక్ట్రమ్‌లపై డీఓటీతో దివాలా కోర్టులో గొడవపడుతోంది.
 You may be interested

గమయాలో 11.25శాతం వాటాను దక్కించుకున్న ఎమ్‌ అండ్‌ ఎమ్‌

Saturday 15th June 2019

 స్విస్ అగ్రి టెక్నాలజీ సంస్థ గమయ ఎస్‌ఏలో 11.25 శాతం ఈక్విటీ వాటాను రూ .30 కోట్లు తో దక్కించుకున్నటు స్వదేశీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ పరికరాల రంగం (ఎఫ్‌ఈఎస్) శుక్రవారం ప్రకటించింది. కొనుగోలులో భాగంగా కంపెనీకి గమయ ఎస్‌ఏలోని 300 సాధారణ షేర్లకు, 30,469 సిరిస్‌ బీ షేర్లకు సబ్‌స్రైబ్‌ అవనుంది. గమయా నిర్వహించిన బీ ఫండింగ్‌ రౌండ్‌లో ఎమ్‌ అండ్‌ ఎమ్‌

హెక్సావేర్‌ చేతికి అమెరికా కంపెనీ

Saturday 15th June 2019

డీల్‌ విలువ రూ.1,266 కోట్లు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన మోబిక్విటీ కంపెనీని మన దేశానికి చెందిన ఐటీ కంపెనీ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ కొనుగోలు చేసింది. ఈ కంపెనీని రూ.1,266 కోట్లకు (18.2 కోట్ల డాలర్ల) కొనుగోలు చేశామని హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ తెలిపింది.  తమ కంపెనీ చరిత్రలో ఇదే అతి పెద్ద కొనుగోలని కంపెనీ సీఈఓ ఆర్‌.శ్రీకృష్ణ పేర్కొన్నారు. మోబిక్విటీ దన్నుతో భారీ డిజిటల్‌ ఏజెన్సీలు, కన్సల్టింగ్‌ సంస్థలతో నేరుగా పోటీపడతామన్నారు. ఈ

Most from this category