300 విమానాలకు ఇండిగో ఆర్డరు
By Sakshi

ముంబై: భారీ వృద్ధి ప్రణాళికల అమల్లో భాగంగా విమానయాన రంగ సంస్థ ఇండిగో తాజాగా 'ఎయిర్‌బస్ 320 నియో' రకానికి చెందిన 300 విమానాలకు ఆర్డరు ఇచ్చింది. ఒక్కో విమానం రేటు వివరాలు వెల్లడించనప్పటికీ.. 2018లో ప్రచురించిన ధర ప్రకారం ఈ ఆర్డరు విలువ సుమారు 33 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 2.3 లక్షల కోట్లు) ఉండొచ్చని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో విమానాల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డరిచ్చిన ఏకైక సంస్థ తమదేనని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో విమానయాన రంగ వృద్ధి కొనసాగుతుందని, చౌక చార్జీలతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉంటామని సంస్థ సీఈవో రణజయ్ దత్తా తెలిపారు. తాజా కాంట్రాక్టుతో ఇండిగో మొత్తం 730 విమానాలకు (ఏ320 నియో) ఆర్డరిచ్చినట్లవుతుంది. ప్రస్తుతం 247 విమానాలతో ఇండిగో ప్రతిరోజూ 1,500 ఫ్లయిట్స్ నడుపుతోంది.
You may be interested
మరిన్ని పన్ను సంస్కరణలు
Wednesday 30th October 2019ఎల్టీసీజీ, ఎస్టీటీ, డీడీటీల్లో మార్పులు పీఎంవో, ఆర్థిక శాఖ సమీక్ష నవంబర్ నాటికి కసరత్తు పూర్తి బడ్జెట్లో లేదా అంతకు ముందే ప్రకటించే అవకాశాలు న్యూఢిల్లీ: మందగమన బాటలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా పలు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇన్వెస్టర్ల సెంటిమెంటును మెరుగుపర్చేందుకు, విదేశీ పెట్టుబడులు మరింతగా ఆకర్షించేందుకు.. మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనుంది. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) ట్యాక్స్, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ), డివిడెండ్ పంపిణీ పన్ను
టాప్ 10 గ్లోబల్ సీఈఓల్లో భారత సంతతి
Wednesday 30th October 20196వ స్థానంలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ 7, 9 ర్యాంకుల్లో అజయ్ బంగా, సత్య నాదెళ్ల హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) తాజా జాబితా వెల్లడి న్యూయార్క్: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అగ్రశేణి 10 కంపెనీల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)ల జాబితాలో.. ఏకంగా ముగ్గురు భారత సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) రూపొందించిన ఈ ఏడాది టాప్-100 ప్రపంచ సీఈఓల్లో అడోబ్ సీఈఓ శంతను