News


కట్టాల్సినది రూ. 21 వేల కోట్లే

Saturday 7th March 2020
news_main1583553350.png-32338

  • ఏజీఆర్‌ బాకీలపై వొడాఫోన్ ఐడియా స్వీయ మదింపు

న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల (ఏజీఆర్‌) కింద తాము కట్టాల్సినది టెలికం శాఖ (డాట్) చెబుతున్న దానికంటే చాలా తక్కువేనని టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్‌) తెలిపింది. వాస్తవంగా తాము చెల్లించాల్సినది రూ. 21,533 కోట్లు మాత్రమేనని స్వీయ మదింపులో తేలిందని సంస్థ వివరించింది. ఇందులో ఇప్పటికే రూ. 3,500 కోట్లు కట్టినట్లు పేర్కొంది. వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్ల పైగా కట్టాలని డాట్ చెబుతోంది. మరోవైపు, వొడాఫోన్ గ్రూప్ సీఈవో నిక్ రీడ్‌ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. కంపెనీని నిలబెట్టేందుకు తోడ్పాటు అందించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో కొత్తగా శుభారంభం చేయాలని కోరుకుంటున్నట్లుగా ఆయన చెప్పారని వివరించాయి. 



You may be interested

రాణా కపూర్‌ నివాసంలో ఈడీ సోదాలు

Saturday 7th March 2020

మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ నివాసంలో (ముంబై) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఈ దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓ కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలం తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని అవకతవకలపైనా ఈడీ విచారణ జరుపుతోంది. 

‘‘యస్‌’’బీఐ..!

Saturday 7th March 2020

వాటాల కొనుగోలుకు ఆసక్తి పునర్నిర్మాణ స్కీమ్‌ ముసాయిదా రూపొందించిన ఆర్‌బీఐ ఇన్వెస్టర్లు 49% వాటాలు  కొనుగోలు చేసేలా ప్రతిపాదన షేరుకు రూ. 10 ధర మూడేళ్ల పాటు లాకిన్‌ అభిప్రాయాల వెల్లడికి మార్చి 9 దాకా గడువు ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ను ఒడ్డున పడేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టింది. యస్‌ బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆసక్తి చూపుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో

Most from this category