News


ప్రస్తుతం ఎలాంటి చెల్లింపులు చేయలేం: ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా

Thursday 23rd January 2020
news_main1579765120.png-31133

ఏజీఆర్‌ సవరణ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేమని వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్‌(డీఓటీ)కు తెలియజేశాయి. టెలికాం కంపెనీల ఈ నిర్ణయంతో జనవరి 23 గడువులోగా ప్రభుత్వానికి ఎటువంటి చెల్లింపులు చేయవనే విషయం స్పష్టమవుతోంది. గతేడాది నవంబర్‌లో సవరించిన ఏజీఆర్‌లపై టెలికాం సంస్థలు జనవరి 23నాటికి డీఓటీకు రూ.1.02 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ అంశంపై రివ్యూ చేయాలన్న టెలికం కంపెనీల అభ్యర్ధనను సుప్రీంకోర్టు గతవారం కొట్టివేసింది. దీంతో కంపెనీలు మరోసారి క్యురేటివ్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ విచారించిన కోర్టు వచ్చేవారం దీనిపై వాదనలు వినాలని నిర్ణయించింది. 

"వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు నుండి మాకు సమాచారం వచ్చింది. ఏజీఆర్‌ల చెల్లింపుల విధివిధానాలు, కాలపరిమితి చర్చలపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నట్లు ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి.’’ అని డీఓటీ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు

ఇంకా ఈ అంశంపై ఆయన స్పందిస్తూ... ‘‘టెలికం కంపెనీల సవరణ పిటీషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించిందనేది వాస్తవం. బకాయిలను చెల్లించాలా వద్దా అనే అంశాన్ని కోర్టు ఖచ్చితంగా చెప్పలేదు. తీర్పు అస్పష్టంగా ఉంది. బకాయిల చెల్లింపు ఆలస్యం ఐనందున అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదని కంపెనీలను ప్రశ్నిస్తూ షో-కాజ్ నోటీసులను జారీ చేయవచ్చు. అయితే సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తూ.. గడువు ముగిసిన తర్వాత జనవరి 24 వరకు డీఓటీ వేచి ఉంటుంది. తదుపరి చర్యలను ప్రారంభించడానికి ముందు, ఈ విషయంపై చట్టపరమైన సలహాలను తీసుకునే అవకాశం ఉంది. లేదా తదుపరి కోర్టు విచారణ కోసం వేచి ఉండి కోర్టులో తమ వాదనలను వినిపించవచ్చు’’ అన్నారు.


ఈ నేపథ్యంలో వోడాఫోన్‌ ఐడియా షేరు మధ్యాహ్నం గం.12:45ని.లకు 7.14శాతం పెరిగి రూ.6.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. భారతీ ఎయిర్‌టెల్‌ 1శాతం లాభంతో రూ.518.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ హైజంప్‌

Thursday 23rd January 2020

మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి మరింత బలపడ్డాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో లాభాలతో కదులుతున్నాయి. సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ చేసింది. 208 పాయింట్లు పెరిగి 41,324కు చేరింది. నిఫ్టీ సైతం 63 పాయింట్లు పుంజుకుని 12,169 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రోత్సాహకర ఫలితాల కారణంగా ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కౌంటర్‌

ఐదునెలల గరిష్ఠానికి సిమెంట్‌ ధరలు!

Thursday 23rd January 2020

ఏడునెలల వరుస పతనం తర్వాత జనవరిలో సిమెంట్‌ ధరలు ఒక్కమారుగా ఐదునెలల గరిష్ఠాలకు ఎగిసాయి. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగ కార్యకలాపాలు జోరందుకోవడంతో సిమెంట్‌ ధరలు పెరిగాయి. డిసెంబర్‌తో పోలిస్తే ఆల్‌ఇండియా సగటు సిమెంట్‌ బస్తా ధర రూ.17 పెరిగి రూ. 340కి చేరిందని బ్లూమ్‌బర్గ్‌ క్వింట్‌ సర్వే తేల్చింది. గతేడాది ఏప్రిల్‌ తర్వాత ఒక్క నెల్లో సిమెంట్‌ ధర ఇంత పెరగడం ఇదే తొలిసారి. ధర పెరుగుదల అధికంగా దక్షిణాదిన

Most from this category