News


ఆర్‌కామ్‌ నష్టాలు రూ.30,142 కోట్లు

Saturday 16th November 2019
news_main1573876701.png-29634

  • రూ.28,314 కోట్ల ఏజీఆర్‌ కేటాయింపులు 
  • రూ.302 కోట్లకు తగ్గిన ఆదాయం 

న్యూఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.30,142 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం దివాలా ప్రక్రియ నడుస్తున్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి) విషయమై సుప్రీం కోర్ట్‌ ఇచ్చిన తీర్పు కారణంగా రూ.28,314 కోట్ల కేటాయింపులు జరపడంతో ఈ కంపెనీకి ఈ క్యూ2లో ఈ స్థాయి నష్టాలు వచ్చాయి. కాగా గత క్యూ2లో రూ.977 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం ఈ క్యూ2లో రూ.302 కోట్లకు తగ్గింది. 



You may be interested

ఐయూసీపై జాప్యం .. టెలికం సేవలకు ప్రతికూలం

Saturday 16th November 2019

రిలయన్స్ జియో వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధానాన్ని 2020 జనవరిలోగా ఎత్తివేయకుండా కొనసాగించిన పక్షంలో అందుబాటు రేట్లలో టెలికం సేవలను అందించడంపై ప్రతికూల ప్రభావం పడుతుందని రిలయన్స్ జియో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్ కాల్స్ నిష్పత్తి దాదాపు సరిసమాన స్థాయిలో ఉందని, ఈ రెండింటి మధ్య భారీ అసమతౌల్యం ఉందన్న కారణంతో ఐయూసీ ఎత్తివేతను వాయిదా వేయడం సరికాదని  జియో డైరెక్టర్ మహేంద్ర నహతా పేర్కొన్నారు.

జీఎంఆర్‌కు పెరిగిన నష్టాలు

Saturday 16th November 2019

క్యూ2లో రూ.457 కోట్ల నికర నష్టం టర్నోవరు రూ.2,018 కోట్లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా‍స్ట్రక్చర్‌ నష్టాలు మరింత పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.457 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.334 కోట్ల నష్టం చవిచూసింది. టర్నోవరు రూ.1,904 కోట్ల నుంచి రూ.2,018 కోట్లకు చేరింది. ఎయిర్‌పోర్టుల విభాగం ఆదాయం రూ.1,315 కోట్ల

Most from this category