STOCKS

News


గార్గ్‌ ఆకస్మిక బదిలీ... వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు

Friday 26th July 2019
Markets_main1564134323.png-27338

న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ కార్యదర్శి పదవిలో ఉన్న సుభాష్‌చంద్రగార్గ్‌(58)ను కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్‌) కార్యదర్శిగా ఉన్న అతను చక్రవర్తిని నియమించింది. బుధవారం రాత్రి ఈ ఆదేశాలు జారీ చేయడంతో గురువారం గార్గ్‌ అనూహ్య నిర్ణయం ప్రకటించారు. స్వచ్చంద పదవీ విరమణకు (వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఈ ఏడాది అక్టోబర్‌ 31 ఉద్యోగిగా తనకు ఆఖరు పనిదినమని ప్రకటించారు. అంటే, నిబంధనల మేరకు ఆగస్ట్‌ నుంచి మూడు నెలల పాటు నోటీస్‌ కాలాన్ని ఆయన పాటించనున్నారు. ఎంతో సీనియర్‌ ఉద్యోగి అయిన గార్గ్‌ ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాతో ఎకనమిక్‌ అఫైర్స్‌ విభాగం(ఈడీఏ) ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇటీవల మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన పెట్టిన 2019-20 బడ్జెట్‌ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే ద్రవ్య పాలసీ, ఆర్‌బీఐ సంబంధిత అంశాలకూ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. అంతేకాదు విదేశీ మార్కెట్ల నుంచి సౌర్వభౌమ బాండ్ల రూపంలో నిధుల సమీకరణ ప్రణాళిక బాధ్యతలూ చూశారు. అయితే, ఇంత కాలం అత్యున్నత ప్రొఫైల్‌గా భావించే ఆర్థిక శాఖ నుంచి తక్కువ ప్రొఫైల్‌ అయిన విద్యుత్‌ శాఖకు మార్చడంతో గార్గ్‌ నిరాశ చెందినట్టున్నారు. వాస్తవానికి 2020 అక్టోబర్‌ చివరి వరకు గార్గ్‌ పదవీ కాలం ఉంది. 1983 రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన గార్గ్‌ 2014లో కేంద్ర సర్వీసులకు వచ్చారు. ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులై 2017 వరకు బాధ్యతలు నిర్వహించారు. 2019 మార్చిలో ఆర్థిక శాఖ కార్యదర్శి పదవిలోకి వచ్చారు. ఆర్థిక శాఖలో ఆర్థిక సేవల కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, డీఈఏ కార్యదర్శి, వ్యయాల కార్యదర్శి, దీపమ్‌ కార్యదర్శులు ఉంటారు. 
ఎంతో నేర్చుకున్నా...
గురువారం డీఈఏ బాధ్యతలను అతను చక్రవర్తికి గార్గ్‌ అప్పగించారు. అనంతరం ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ఎకనమిక్‌ అఫైర్స్‌ బాధ్యతలను అప్పగించాను. ఆర్థిక శాఖ ఎనమిక్‌ అఫైర్స్‌ విభాగంలో ఎంతో నేర్చుకున్నాను. విద్యుత్‌ శాఖలో బాధ్యతలను రేపు (శుక్రవారం) స్వీకరిస్తాను. అక్టోబర్‌ 31 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఐఏఎస్‌కు స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నాను’’ అంటూ గార్గ్‌ ట్వీట్‌ చేశారు. నిబంధనల మేరకు మూడు నెలల నోటీస్‌ ఇవ్వాల్సి ఉంటుందని, అదే చేశానని ఆర్థిక శాఖ కార్యాలయ భవనం నార్త్‌బ్లాక్‌ను వీడి వెళుతున్న సమయంలో విలేకరులకు చెప్పారు. ఆర్‌బీఐ వద్ద అదనంగా ఉన్న మిగులు నిల్వలను ప్రభుత్వానికి బదిలీ చేసే అంశంపై అధ్యయనం చేసిన ప్యానల్‌లోనూ సభ్యునిగా గార్గ్‌ పనిచేశారు. You may be interested

అంచనాల్ని మిం‍చిన మారుతి ఫలితాలు...పెరిగిన షేరు

Friday 26th July 2019

కానీ 27 శాతం క్షీణించిన లాభాలు మారుతి సుజుకి జూన్‌ త్రైమాసికంలో మార్కెట్ల అంచనాల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. ఈ కంపెనీ శుక్రవారం మధ్యాహ్నం తన జూన్‌ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు వెల్లడికాకముందు రూ.5,700 దిగువకు పడిపోయిన మారుతి సుజుకి షేరు...ఫలితాల వెల్లడి తర్వాత 2.5 శాతం లాభంతో రూ. 5,900పైకి ఎగబాకింది. చివరకు ఎన్‌ఎస్‌ఈలో 0.85 శాతం లాభంతో రూ. 5,805 వద్ద ముగిసింది. తక్కువ అమ్మకాల పరిమాణం,

టాటా మోటార్స్‌ నష్టాలు రూ.3,679 కోట్లు

Friday 26th July 2019

8 శాతం తగ్గి రూ.61,467 కోట్లకు ఆదాయం  నాలుగు రెట్లు పెరిగిన వడ్దీ వ్యయాలు  మళ్లీ లాభాల్లోకి వస్తాం  4.5 శాతం నష్టపోయిన టాటా మోటార్స్‌ షేర్‌  న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.1,863 కోట్లుగా ఉన్న నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ1లో దాదాపు రెట్టింపై రూ.3,680 కోట్లకు పెరిగాయి. చైనాతో పాటు భారత్‌లో కూడా

Most from this category