STOCKS

News


భవిష్యత్తు ‘షా’లకు బాటలు వేస్తా

Wednesday 11th September 2019
news_main1568174377.png-28298

  • స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటు
  • పదేళ్లలో పది కోట్ల మందికి ఉపాధి
  • వినూత్న ఆలోచనలున్న యువతకు మార్గదర్శకం
  • ఎంసీఎక్స్‌ వ్యవస్థాపకుడు జిగ్నేషా వెల్లడి

న్యూఢిల్లీ: ఎంసీఎక్స్‌ వ్యవస్థాపకుడు జిగ్నేష్‌ షా (52) త్వరలో రెండో విడత ప్రయాణం మొదలుపెట్టనున్నారు. వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కల్పించేందుకు మార్గదర్శిగా వ్యవహరించాలన్న ప్రణాళికలతో ఉన్నారు. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌లో వంద రెట్లు అధిక వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే ఓ స్టార్టప్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసి, నవ్యత, వినూత్న ఆలోచనలు కలిగిన యువతను వెన్నుతట్టి, వారికి మార్గదర్శకంగా వ్యవహరించి.. వారి కలలు సాకారం చేసే దిశగా కృషి చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ‘‘నేను ఎక్సేంజ్‌లను ఏర్పాటు చేసి, భిన్న ఉత్పత్తులను ఆవిష్కరించడం ద్వారా ఫైనాన్షియల్‌ మార్కెట్లో ఉన్నత వర్గాల కోసం వినూత్నంగా ఎంతో చేశాను. ఇప్పుడు సామాన్యుల కోసం ఏదో ఒక భిన్నమైనది చేయాలనుకుంటున్నాను. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కోచ్‌గా వ్యవహరించడం ద్వారా, నా మొత్తం అనుభవంతో ప్రపంచ స్థాయి సంస్థలను అన్ని విభాగాల్లో సృష్టించగలను. భవిష్యత్తు తరం జిగ్నేష్‌షాల కోసం పెద్ద వేదికను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను’’ అని జిగ్నేష్‌ షా వివరించారు. ఓ వార్తా సంస్థకు ఆయన తన భవిష్యత్తు ప్రయాణం విషయమై ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘‍స్పాట్‌’పెట్టింది...
గుజరాత్‌కు చెందిన జిగ్నేష్‌ షా ఇంజనీర్‌ నుంచి ఫైనాన్షియల్‌ మార్కెట్‌ విజేతగా మారి ఒకప్పుడు ఆరు దేశాల్లో 14 ఎక్సేంజ్‌లు (ఎంసీఎక్స్‌ సహా) ఏర్పాటు చేశారు. అందులో ఒకటైన నేషనల్‌ స్పాట్‌ ఎక్సేంజ్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఈఎల్‌) రూ.5,600 కోట్ల చెల్లింపుల్లో 2013లో విఫలం కావడం ఆయన విజయయాత్రకు బ్రేక్‌ పడింది. రోజువారీ రూ.200 కోట్ల వ్యాపారం నడిచే ఎన్‌ఎస్‌ఈఎల్‌లో సంక్షోభం కారణంగా, నేడు కమోడిటీ ట్రేడింగ్‌ మార్కెట్‌ లీడర్‌గా, నిత్యం రూ.1.20 లక్షల కోట్ల వ్యాపారం జరిగే ఎంసీఎక్స్‌తోపాటు ఇతర అన్ని ఎక్సేంజ్‌లను జిగ్నేష్‌ షా కోల్పోయారు. ఆయనపై నియంత్రణ, దర్యాప్తు సంస్థలు కేసుల నమోదు చేసి విచారణ చేపట్టాయి.
దేశం గర్వించే వ్యాపారాలను సృష్టించా...
‘‘కమోడిటీ ట్రేడింగ్‌లో భారత్‌ను ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా నిలబెట్టిన వ్యాపారాన్ని(ఎంసీఎక్స్‌) సృష్టించాను. చికాగో మర్కంటైల్‌ ఎక్సేంజ్‌ (యూఎస్‌) తర్వాతి స్థానం ఎంసీఎక్స్‌దే. ప్రారంభించిన అన్ని ఎక్సేంజ్‌ల వ్యాపారాల్లో అగ్రగణ్యులుగానే ఉన్నాం. రాజకీయంగా అంత అనుకూల వాతావరణం లేని సమయంలోనే ఈ ఘనత సాధించాను. ఇప్పుడు అయితే ప్రధాని నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో మంచి ప్రోత్సాహకర వాతావరణం ఉంది. వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగాల కల్పన చేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది. 2003-13 మధ్య పదేళ​‍్ల కాలంలో ఎక్సేంజ్‌ల ద్వారా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించడం జరిగింది. దీని కంటే వంద రెట్లు భారీ అవకాశాలు వ్యవస్థాపకత రూపంలో ఉన్నాయి. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ (స్టార్టప్‌ల ఏర్పాటుకు వీలుగా అన్ని రకాల వ్యవస్థలతో కూడిన వేదిక) ద్వారా కనీసం కోటి నుంచి పది కోట్ల ఉద్యోగాలను రానున్న పదేళ్లలో సృష్టించగలను’’ అని జిగ్నేష్‌ షా తన ప్రణాళికలను వివరించారు. జిగ్నేష్‌షా తొలుత ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఎక్సేంజ్‌ల విభాగంలోకి వేగంగా అడుగులు వేసి రాణించారు. ఎన్‌ఎస్‌ఈఎల్‌ సంక్షోభం అనంతరం ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ పేరు 63మూన్స్‌ టెక్నాలజీస్‌గా పేరు మార్చుకుంది. ఇప్పుడు ఆ కంపెనీకి గౌరవ చైర్మన్‌గా షా వ్యవహరిస్తున్నారు.
త్వరలో స్పష్టత... 
అయితే, తన ప్రణాళికలపై ఇంకా కసరత్తు కొనసాగుతోందని ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే దీని గురించి వర్ణించలేనని, కాకపోతే ఇది తాను ఇప్పటి వరకు చేసిన దానికి చాలా కొత్తగా ఉంటుందని అయితే చెప్పారు. వ్యవసాయం తనను ఎక్కువగా ఆకర్షిస్తున్న రంగమని తెలిపారు. జెనెటిక్స్‌, రోబోటిక్స్‌, టెక్నాలజీ, ఇలా అన్నింటా స్టార్టప్‌లకు బాటలు పరుస్తామన్నారు. ప్రపంచ స్థాయికి విస్తరించాలనే ఆకాంక్షతో కూడిన ఆవిష్కర్తలకు ఆహ్వానం పలుకుతామని వెల్లడించారు. You may be interested

పుత్తడి ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు

Wednesday 11th September 2019

-8 నెలల తర్వాత గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు  -పుత్తడి ధరలు పెరగడమే కారణం  -యాంఫీ వెల్లడి  న్యూఢిల్లీ: గోల్డ్‌ ఈటీఎఫ్‌(ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌)ల జోరు పెరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో రూ.145 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత ఎనిమిది నెలలుగా ఈ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు సొమ్ములు వెనక్కి తీసుకోవడమే గానీ, పెట్టుబడులు పెట్టింది లేదు. కానీ ఆగస్టులో మాత్రం పెట్టుబడులు వచ్చాయి. డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటం, పుత్తడి ధరలు

అలీబాబా చైర్మన్‌ ‘జాక్‌ మా’ రాజీనామా

Wednesday 11th September 2019

55వ పుట్టిన రోజు నాడు నిర్ణయం బీజింగ్‌: చైనాలో ఆన్‌లైన్‌ రిటైలింగ్‌ బూమ్‌ను సృష్టించి, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్‌ కంపెనీ అలీబాబాను సృష్టించిన జాక్‌మా, చైర్మన్‌ పదవి నుంచి మంగళవారం తప్పుకున్నారు. చైనా-అమెరికా మధ్య వాణిజ్య పోరుతో పరిశ్రమ అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన తప్పుకోవడం ఆసక్తిగా మారింది. చైనాలోనే సంపన్నుడైన జాక్‌మా సరిగ్గా 55వ పుట్టిన రోజు నాడే అలీబాబా చైర్మన్‌ పదవిని వదులుకున్నారు. నిజానికి ఏడాది

Most from this category