News


ఏడాదిలోగా బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ విలీనం పూర్తి..!

Thursday 21st November 2019
Markets_main1574306384.png-29741

  • కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ల విలీన ప్రక్రియ వచ్చే 18 నుంచి 24 నెలల్లోనే పూర్తికానుందని టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు. భారీ నష్టాలతో కుదేలవుతున్న ఈ సంస్థలను విలీనం చేసేందుకు అక్టోబర్‌ 23న కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని వివరించారు. 2010 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాల్లో ఉండగా.. గత పదేళ్ల నుంచి ఎంటీఎన్‌ఎల్‌ నష్టాలను ప్రకటిస్తోందని చెప్పారు. ఇరు సంస్థల రుణ భారం రూ. 40,000 కోట్లుగా ఉందన్నారు. 

వీఆర్‌ఎస్‌కు 77,000 మంది సిద్ధం
బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌)కు 77,000 మందికి పైగా సిబ్బంది ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్‌ 3 వరకు ఇందుకు సమయం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఎంటీఎన్‌ఎల్‌ వీఆర్‌ఎస్‌కు 13,532 మంది ఉద్యోగులు దరఖాస్తు చేశారు. 



You may be interested

ఫోర్బ్స్‌ ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌లో ‘మేఘా’కు ప్రత్యేక స్థానం!

Thursday 21st November 2019

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ ఇండియా మేగజీన్‌..  ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌ 2019’లో మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) చైర్మన్‌ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఎడిషన్‌లో ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్‌ ఇండియా ప్రచురించింది. దేశంలోని అత్యంత సంపన్నులకు సంబంధించి ఇటీవల ఫోర్బ్స్‌ విడుదల చేసిన 2019 జాబితాలో పీపీ రెడ్డి 3.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 39వ స్థానంలో నిలిచిన సంగతి

ప్రైవేట్‌ ‘సై’రన్‌

Thursday 21st November 2019

బీపీసీఎల్, ఎస్‌సీఐ, కా¯న్‌కర్‌లో వాటాల విక్రయం మరికొన్ని పీఎస్‌యూల్లో 51 శాతం లోపునకు వాటాలు కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు  న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే దిశగా కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. పలు ప్రభుత్వ రంగ దిగ్గజాల్లో (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చమురు దిగ్గజం బీపీసీఎల్, షిప్పింగ్‌ సంస్థ ఎస్‌సీఐ, కార్గో సేవల సంస్థ కాన్‌కర్‌లో వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర

Most from this category