STOCKS

News


ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ మూసివేత

Tuesday 19th November 2019
news_main1574134422.png-29688

  • 2015లో లైసెన్స్‌
  • 2018లో కార్యకలాపాలు మొదలు
  • ఈ ఏడాది జూలైలో స్వచ్ఛందంగా మూసివేత 


ముంబై: మరో పేమెంట్స్‌ బ్యాంక్‌ మూసివేత ఖరారైంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌కు తాజాగా  ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద మూసివేత కోసం ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ దరఖాస్తు చేసిందని, ఈ విషయమై బాంబే హై కోర్ట్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 18న ఆదేశాలు జారీ చేసిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా ఐడియా  పేమెంట్స్‌  బ్యాంక్‌ లిక్విడేటర్‌గా విజయ్‌కుమార్‌ వి అయ్యర్‌ను బాంబై హై కోర్ట్‌ నియమించిందని వివరించింది. అయ్యర్‌ డెలాయిట్‌ టచ్‌ తొమత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీలో సీనియర్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని, దీంతో ఈ వ్యాపారాన్ని నిర్వహించలేమని, స్వచ్ఛంద మూసివేతను ఈ ఏడాది జూలైలోనే ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రకటించింది.  2015 ఆగస్టులో ఆర్‌బీఐ మొత్తం 11 సంస్థలకు పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాల లైసెన్స్‌లను ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలను ప్రారంభించింది. 

నాలుగో కంపెనీ....!
పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ రంగం నుంచి వైదొలగిన నాలుగో కంపెనీగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ నిలిచింది. గతంలో  దిలిప్‌ సంఘ్వి, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, టెలినార్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ల కన్సార్షియంతో పాటు టెక్‌ మహీంద్రా, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఈ రంగం నుంచి వైదొలిగాయి. 



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీలపై దివాలా చర్యలకు శ్రీకారం!

Tuesday 19th November 2019

న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలుసహా నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లపై దివాలా చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ సోమవారం ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘‘తాజా ఆడిటెడ్‌ బ్యాలెన్స్‌ షీట్‌ ప్రకారం రూ.500 కోట్లు ఆపైన ఆస్తులు కలిగిఉన్న ఎన్‌బీఎఫ్‌సీ (హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలుసహా)లపై దివాలా ప్రక్రియను చేపట్టవచ్చు’’ అని పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)తో చర్చల

బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఆమోదం

Tuesday 19th November 2019

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల విలీనానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఆర్థిక సేవల విభాగం ఒక లేఖ రాసిందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తెలిపింది. మరోవైపు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ల విలీనానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు

Most from this category