News


తొలి ఎన్‌బీఎఫ్‌సీ కమర్షియల్‌ పేపర్ల లిస్టింగ్‌

Friday 29th November 2019
news_main1574999082.png-29940

ముంబై: నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఆదిత్య బిర్లా ఫైనాన్స్ (ఏబీఎఫ్‌ఎల్‌) తమ కమర్షియల్ పేపర్స్‌ను (సీపీ) స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేసింది. తద్వారా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన తొలి ఎన్‌బీఎఫ్‌సీగా నిల్చింది. ఈ సీపీ ద్వారా ఏబీఎఫ్‌ఎల్ రూ. 100 కోట్లు సమీకరించింది. వీటి మెచ్యూరిటీ గడువు 2020 ఫిబ్రవరి 7గా ఉంటుందని స్టాక్ ఎక్స్చేంజీలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. స్వల్పకాలిక రుణాలకు సంబంధించిన కమర్షియల్ పేపర్ల లిస్టింగ్‌కు తగిన విధానాలు రూపొందించాలంటూ స్టాక్ ఎక్స్చేంజీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ ఏడాది అక్టోబర్‌లో సూచించింది. సెబీ నిబంధనల ప్రకారం.. కనీసం రూ. 100 కోట్ల నికరవిలువ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు, కంపెనీలకు లిస్టింగ్ అర్హత ఉంటుంది. 



You may be interested

నష్టాల ప్రారంభం

Friday 29th November 2019

ఆసియా మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల ఫలితంగా భారత్‌ స్టాక్‌ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60 పాయింట్ల నష్టంతో 41,070 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 12,126 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

రూ.100 కోట్లతో స్నేహా ఫామ్స్‌ విస్తరణ

Friday 29th November 2019

ప్రాసెసింగ్‌, స్టోరేజీ సామర్థ్యం పెంపు త్వరలో కంపెనీ నుంచి ఫ్రోజెన్‌ చికెన్‌ రెడీ టు ఈట్‌ విభాగంలోకి సైతం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- పౌల్ట్రీ రంగ సంస్థ స్నేహా ఫామ్స్‌ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రాసెసింగ్‌ కెపాసిటీ గంటకు 6,000 బర్డ్స్ నుంచి 12,000లకు చేర్చనుంది. అలాగే కోల్డ్‌ స్టోరేజీ సామర్థ్యం ప్రస్తుతం 2,000 టన్నులుంది. దీనికి 3,000 టన్నులకు పెంచనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకల్‌ వద్ద కంపెనీకి ప్రాసెసింగ్‌ ప్లాంటుతోపాటు శీతల గిడ్డంగి

Most from this category