News


భారత్‌ వృద్ధి రేటుకు ఏడీబీ కోత

Thursday 26th September 2019
news_main1569470194.png-28552

  • 7.2 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే వృద్ధి వేగంలో చైనా కన్నా భారత్‌ ముందు  ఉందని పేర్కొంది. తయారీ రంగం బలహీనంగా ఉండడం, పెట్టుబడుల్లో అనిశ్చితి, బ్యాంకింగ్‌, ఇతర ఆర్థిక సంస్థల రుణ మంజూరీల్లో స్పీడ్‌ లేకపోవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కూడా క్రియాశీలత లేకపోవడం వంటి అంశాలు భారత్‌ వృద్ధి రేటు అంచనాల కోతకు కారణమని ఏడీబీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) భారత్‌ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా 2020-21లో భారత్‌ వృద్ధి రేటు 7.2 శాతానికి పెరుగుతుందన్నది తమ అంచనా అని ఏడీబీ పేర్కొంది. 



You may be interested

71.02 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Thursday 26th September 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం ప్లాట్‌గా 71.02 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినప్పటికి, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో రూపీ డాలర్‌ మారకంలో 3 పైసలు బలహీనపడి 7.03 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు ప్రతికూలంగా కదులుతుండడం, యుఎస్‌లో రాజీకీయ అనిశ్చితి, విదేశీ నిధుల ఔట్‌ఫ్లో కొనసాగుతుండడం వంటి కారణాలు రూపీ పై ప్రభావం చూపుతున్నాయని ఫారెక్స్‌ ట్రేడర్స్‌

మళ్లీ ముకేశ్‌‘‘క్యాష్‌’’ కింగ్‌..!

Thursday 26th September 2019

భారత్‌లో ఆయనే అత్యంత సంపన్నుడు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా  రిచ్‌ లిస్ట్‌ వెల్లడి వరుసగా ఎనిమిదేళ్లుగా ముకేశ్‌దే అగ్రస్థానం రెండవ స్థానంలో హిందూజాలు ముంబై: భారత్‌లో అత్యంత సంపన్నునిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద రూ.3,80,7000 కోట్లు.  తాజా ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ఆయనదే అగ్రస్థానం. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో లండన్‌

Most from this category