News


కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా

Saturday 4th January 2020
news_main1578116105.png-30658

  • 75 శాతం వాటా కొనుగోలు
  • డీల్‌ విలువ రూ.5,520 కోట్లు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో అతిపెద్ద మల్టీపోర్ట్‌ ఆపరేటర్‌ అయిన అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌.. కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో (కేపీసీఎల్‌) 75 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. డీల్‌ విలువ రూ.5,520 కోట్లు. కేపీసీఎల్‌ను ప్రమోట్‌ చేస్తున్న సీవీఆర్‌ గ్రూప్‌ నుంచి ఈ వాటాను దక్కించుకుంటోంది. కేపీసీఎల్‌ను రూ.13,572 కోట్లుగా విలువ కట్టారు. మల్టీ కార్గో ఫెసిలిటీ కలిగిన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు ద్వారా 2018-19లో 5.4 కోట్ల మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా జరిగింది. దీనిని ఏడేళ్లలో 10 కోట్ల మెట్రిక్‌ టన్నుల స్థాయికి తీసుకు వెళ్లాలని అదానీ పోర్ట్స్‌ భావిస్తోంది. కృష్ణపట్నం పోర్టు గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,394 కోట్ల టర్నోవర్‌ సాధించింది. తూర్పు తీరంలో అదానీకి ఇది అయిదవది కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మొదటిది. కాగా, 2025 నాటికి 40 కోట్ల మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా స్థాయికి చేరాలన్న అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లక్ష్యానికి ఈ కొనుగోలు దోహదం చేయనుంది. తాజా డీల్‌తో దేశంలో పోర్టుల వ్యాపారంలో తమ సంస్థ వాటా ప్రస్తుతమున్న 22 నుంచి 27 శాతానికి చేరుతుందని అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్త విస్తరణలో ఇది తమకు విలువ చేకూరుస్తుందని చెప్పారు. 120 రోజుల్లో ఈ లావాదేవీని పూర్తి చేస్తారు. 



You may be interested

ఇరాన్‌ షాక్‌- డోజోన్స్‌ పతనం

Saturday 4th January 2020

అమెరికా స్టాక్‌ మార్కెట్లకు అమ్మకాల దెబ్బ రికార్డ్‌ గరిష్టం నుంచి ఎస్‌అండ్‌పీ వెనక్కి మైనస్‌లో ముగిసిన నాస్‌డాక్‌ ఇండెక్స్‌ ఇండియన్‌ ఏడీఆర్‌లు డీలా వారాంతాన మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు అమెరికా స్టాక్‌ మార్కెట్లను దెబ్బకొట్టాయి. దీనికితోడు డిసెంబర్‌లో తయారీ రంగం దశాబ్ద కాలంలో లేనివిధంగా నీరసించినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. వెరసి ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో శుక్రవారం డోజోన్స్‌ 234 పాయింట్లు(0.8 శాతం) పతనమై 28,635 వద్ద ముగిసింది. ఇటీవల రికార్డు గరిష్టాలను చేరుతున్న ఎస్‌అండ్‌పీ-500

విద్యుత్ వాహనాలకు ఊతం

Saturday 4th January 2020

ఫేమ్‌-2 కింద 2,636 చార్జింగ్ స్టేషన్లకు అనుమతులు తెలంగాణలో 138, ఏపీలో 266 ఏర్పాటు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ వెల్లడి న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ ఇండియా స్కీమ్ రెండో విడతలో భాగంగా 2,636 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. 24 రాష్ట్రాల్లోని 62 నగరాల్లో ఇవి ఏర్పాటు కానున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ వెల్లడించారు. ఆయా నగరాల్లో

Most from this category