News


అదానీ పోర్ట్స్‌ సెజ్‌ లాభం 72 శాతం

Tuesday 12th November 2019
news_main1573528713.png-29514

  • రూ.1,059 కోట్లకు పెరిగిన నికర లాభం 
  • కార్గో, కంటైనర్‌ విభాగాల్లో పెరుగుతున్న మార్కెట్‌ వాటా 

న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఏపీసెజ్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 72 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.614 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,059 కోట్లకు పెరిగిందని ఏపీసెజ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,922 కోట్ల నుంచి రూ.3,327 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ కిరణ్‌ అద్వాని తెలిపారు. కీలకమైన ప్రాంతాల్లో మల్టీ కమోడిటీ పోర్ట్స్‌ ఉండటం వల్ల తమ కంపెనీ మార్కెట్‌ షేర్‌ పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో సరుకు రవాణాలో మార్కెట్‌ వాటా 1 శాతం పెరగి 22 శాతానికి చేరిందని తెలిపారు. అలాగే కంటైనర్‌ విభాగంలో 35 శాం మార్కెట్‌ వాటా సాధించామని చెప్పారు. సెప్టెంబర్‌ క్వార్టర్‌ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, కంటైనర్‌ విభాగంలో మంచి వృద్ధి సాధించామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో సగం మరింత వృద్ధి సాధించగలమని చెప్పారు. రానున్న సంవత్సరాల్లో కార్గో విభాగం 10-12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని పేర్కొన్నారు. 



You may be interested

70వేలకు చేరిన బీఎస్‌ఎన్‌ఎల్‌ వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Tuesday 12th November 2019

బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌ పుర్వార్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) కింద ఇప్పటికి 70,000కి మందికి దరఖాస్తు చేసుకున్నారు. సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌ సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో

హిందాల్కోకు మందగమనం సెగ

Tuesday 12th November 2019

నికర లాభం 33 శాతం డౌన్‌  రూ.29,944 కోట్లకు తగ్గిన ఆదాయం న్యూఢిల్లీ: హిందాల్కో ఇండస్ట్రీస్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 33 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,448 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.974 కోట్లకు తగ్గిందని హిందాల్కో ఇండస్ట్రీస్‌ తెలిపింది. అంతర్జాతీయ మందగమనం, కమోడిటీల ధరలు తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ సతీశ్‌

Most from this category