News


అదానీ చేతికి ఎస్సెల్‌ సోలార్‌ ప్లాంట్లు

Friday 30th August 2019
news_main1567146486.png-28112

  • డీల్‌ విలువ రూ.1,300 కోట్లు 

ముంబై: ఎస్సెల్‌ గ్రూప్‌నకు చెందిన సౌర శక్తి ప్లాంట్లను అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ట్రాన్సిమిషన్‌ కొనుగోలు చేయనున్నది. ఎస్సెల్‌ గ్రూప్‌నకు చెందిన రెండు అనుబంధ సం‍స్థలు-ఎస్సెల్‌ గ్రీన్‌ ఎనర్జీ, ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ఆధ్వర్యంలోని 205 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లను రూ.1,300 కోట్లకు కొనుగోలు చేస్తున్నామని అదానీ గ్రీన్‌ ఎనర్జీ తెలిపింది. ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య నిశ్చయాత్మక ఒప్పందం కుదిరందని పేర్కొంది. అంతా నగదుతోనే కూడుకున్న ఈ లావాదేవీ అక్టోబర్‌ మధ్యకల్లా పూర్తవుతుందని అంచనా. భారీగా ఉన్న రుణ భారం (రూ.6,776 కోట్లు) తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎస్సెల్‌ గ్రూప్‌ ఆస్తులను విక్రయిస్తోంది. కాగా  ఈ సౌర ప్లాంట్ల కొనుగోళ్లతో అదానీ గ్రూప్‌ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 2,353 మెగావాట్లకు పెరుగుతుంది. 



You may be interested

పెరిగిన షార్ట్స్‌ రోల్‌ఓవర్‌.. అప్‌మూవ్‌కు ప్రతికూలమే!

Friday 30th August 2019

-సెప్టెంబర్‌ సిరీస్ రోల్‌ఓవర్‌లో పెరిగిన షార్ట్‌పొజిషన్లు దేశియ, అంతర్జాతీయ ఆర్థిక మందగమన ఆందోళనలు, యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ కారణాన ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌ సిరీస్‌లో అధికంగా షార్ట్‌ పొజిషన్‌లను రోల్‌ఓవర్‌ చేసుకున్నారు. కాగా ఈ భయాలు ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక చర్యలు, ద్రవ్యలభ్యత చర్యలను నిరుపయోగం చేశాయని విశ్లేషకులు తెలిపారు. నిఫ్టీ అగష్టు సిరీస్‌లో 2.7 శాతం నష్టపోయింది. దీంతో గత వరుస మూడు సిరీస్‌లలో నిఫ్టీ నష్టల్లోనే ముగియడం గమనార్హం. నిఫ్టీ అగష్టు

మార్కెట్లోకి మహీంద్రా కొత్త బొలెరొ సిటీ పిక్‌ అప్‌

Friday 30th August 2019

ప్రారంభ ధర రూ.6.25 లక్షలు బెంగళూరు: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’ (ఎం అండ్‌ ఎం).. ప్రత్యేకించి నగర అవసరాలకు తగిన విధంగా రూపొందించిన ‘బొలెరొ సిటీ పిక్‌-అప్‌’ వాహనాన్ని గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన పిక్‌-అప్‌ వాహన ధర రూ.6.25 లక్షలు(ఎక్స్‌షోరూమ్‌- బెంగళూరు)గా నిర్ణయించింది. ఫోర్‌-సిలెండర్‌.. 2,523 సీసీ డిజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ నూతన వాహనానికి 1.4 టన్నుల పేలోడ్ సామర్థ్యం ఉన్నట్లు

Most from this category