News


జీఎంఆర్‌ పోర్టు అదానీ చేతికి!

Thursday 23rd January 2020
news_main1579748820.png-31115

హైదరాబాద్‌: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ ఆంధ్రప్రదేశ్‌లో మరో డీల్‌కు సిద్ధమైందని సమాచారం. కాకినాడలో నిర్మాణంలో ఉన్న కమర్షియల్‌ పోర్టుతోపాటు తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని కోన గ్రామంలో ఉన్న సెజ్‌ను జీఎంఆర్‌ గ్రూప్‌ నుంచి కొనుగోలు చేయనుంది. ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తున్నదీ త్వరలో వెల్లడి కానుంది. పోర్టు అభివృద్ధికే జీఎంఆర్‌ సుమారు రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తోంది. కాకినాడ సెజ్‌ పరిధిలో 8,521 ఎకరాలు, కమర్షియల్‌ పోర్టు 1,811 ఎకరాల్లో విస్తరించింది. కమర్షియల్‌ పోర్టు కన్సెషన్‌ పీరియడ్‌ 30 ఏళ్లు. మరో 20 ఏళ్లు పొడిగించేందుకు వీలుంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అదానీ విస్తరణకు ఈ డీల్‌ దోహదం చేయనుంది. అదానీ ఇటీవలే కృష్ణపట్నం పోర్టు కంపెనీలో 75 శాతం వాటాను సుమారు రూ.13,500 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తూర్పు తీరంలో కృష్ణపట్నంతోపాటు ఒరిస్సాలోని ధమ్రా, తమిళనాడులోని కట్టుపల్లి, కామరాజార్‌ పోర్టులను అదానీ పోర్ట్స్‌ నిర్వహిస్తోంది. 



You may be interested

ఎస్‌బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి

Thursday 23rd January 2020

 బాధ్యతలు స్వీకరించిన చల్లా శ్రీనివాసులు శెట్టి ​​​​​​​హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఎండీగా చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగేలా కేంద్రం ఆయన నియామకాన్ని ఖరారు చేయటంతో... మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. గతంలో ఈయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1988లో అహ్మదాబాద్‌ ఎస్‌బీఐలో

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.2,560 కోట్లు

Thursday 23rd January 2020

15 శాతం వృద్ధి  మొత్తం ఆదాయం రూ.36,718 కోట్లు న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టూబ్రో(ఎల్‌ అండ్‌ టీ) ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.2,560 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం (రూ.2,219 కోట్లు)తో పోలిస్తే 15 శాతం వృద్ధి సాధించామని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. పన్ను వ్యయాలు 37

Most from this category