News


రిలయన్స్‌ హోమ్స్‌ రూ.400కోట్ల చెల్లింపుల డీఫాల్ట్‌

Saturday 29th June 2019
news_main1561798396.png-26686

అనిల్‌ అంబానీకి చెందిన అడాగ్‌ గ్రూప్‌ కంపెనీలకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. తాజాగా అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ హోమ్స్‌ సంస్థ శుక్రవారం నాన్‌ - కన్వర్టబుల్‌ డిబెంచర్లపై చెల్లించాల్సిన రూ.400 కోట్లను చెల్లించడంలో విఫలమైంది. అప్పులను చెల్లించడానికి జరుగుతున్న మోనటైజేషన్‌ ప్రక్రియ నుంచి రావాల్సిన ఆదాయం సరైన సమయంలో అందకపోవడంతో డిబెంచర్ల రుణాన్ని చెల్లించలేకపోయినట్లు శనివారం కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ మొత్తం రుణాన్ని చెల్లించేందుకు కంపెనీ 4నెలల సమయం గడువు పడుతుందని కంపెనీ తెలిపింది. ‘హౌసింగ్‌ రంగంలో కొనసాగుతున్న తీవ్రమైన ద్రవ్య సంక్షోభం దృష్ట్యా నేడు డిబెంచర్లకు చెల్లించాల్సిన రూ.400 కోట్ల మొత్తాన్ని 2019 అక్టోబర్ 31 వరకు పొడిగించబడింది. ఈ మేరకు సంబంధిత డిబెంచర్‌ ట్రస్టీలకు, ఎన్‌సీడీ హోల్డర్లకు వ్రాత పూర్వకంగా తెలియజేశాము. ఈ పొడగింపు ప్రక్రియ ఇది పరస్పర అంగీకారంతోనే జరిగింది. ఇది డీఫాల్ట్‌ అనడానికి ఎలాంటి ఆస్కారం లేదని’’ అని అడాగ్‌ గ్రూప్‌ కంపెనీ మీడియా ప్రతినిధులను తెలిపారు. గత నెలలో రియలన్స్‌ నిప్పాన్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్‌ వ్యాపారాన్ని తన జపాన్‌ భాగస్వామ్య కం‍పెనీ నిప్పాన్‌ గ్రూప్‌కు విక్రయించి మ్యూచవల్‌ ఫండ్‌ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగిన సంగతి తెలిసిందే. మరోవైపు పలు రేటింగ్‌ ఏజెన్సీలు ఈ గ్రూప్‌నకు చెందిన కంపెనీల ఆర్థిక పనితీరుపై ఆందోళనల వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు రేటింగ్‌ ఏజెన్సీలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ రేటింగ్‌ను ‘‘డిఫాల్ట్‌’’ గ్రేడ్‌ కేటాయించాయి. 



You may be interested

బడ్జెట్‌ నుంచి ఆటోరంగానికి ఏం కావాలి?

Saturday 29th June 2019

గత ఏడాది నుంచి దేశియ ఆటో రంగం అధ్వాన్న స్థితిలో ఉంది. వైఓవై (ఇయర్‌ ఆన్‌ ఇయర్‌) ప్రకారం ఆటోమొబైల్స్‌ అమ్మకాలు 20 శాతం మేర తగ్గాయి. ఈ జాబితా ఇంకా పెరుగుతునే ఉంది. 2019 బడ్జెట్‌లో ఈ రంగానికి దన్నుగా ఎటువంటి పాలసీలున్నాయి? ఆటోరంగం ఈ బడ్జెట్‌ ఎటువంటి అంశాలను కోరుకుంటుంది? ఆటోమొబైల్స్‌పై జీఎస్‌టీ రేటు తగ్గింపు: ఆటోమొబైల్స్‌పై విధిస్తున్నా 28శాతం జీఎస్‌టీ వలన వీటిని సిగరెట్స్‌, లక్సరీ వస్తువులలా అంటరానివిగా

ఫ్లాట్‌గా ముగిసిన పసిడి

Saturday 29th June 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం ఫ్లాట్‌ ముగిసింది. అమెరికా రాత్రి ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,413.79 డాలర్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, జూలైలో ఫెడ్‌వడ్డీరేట్ల కోత అంచనాలపై ఆశాహనంతో పసిడి ధర 2016 తరువాత ఒకనెలలో అతిపెద్ద లాభాల్ని ఆర్జించింది. ఈ జూన్‌ నెలలో  ఆగస్టు పసిడి ఫ్యూచర్ల కాంట్రాక్టు ధర ఏకంగా 7.8శాతం ర్యాలీ చేశాయి.  బలమైన

Most from this category