News


70వేలకు చేరిన బీఎస్‌ఎన్‌ఎల్‌ వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Tuesday 12th November 2019
news_main1573528894.png-29515

  • బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌ పుర్వార్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) కింద ఇప్పటికి 70,000కి మందికి దరఖాస్తు చేసుకున్నారు. సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌ సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం పొందడానికి అర్హులు. ‘‘ఇప్పటి వరకూ 70,000కుపైగా దరఖాస్తులు వచ్చాయి. అన్ని కేడర్ల నుంచీ పథకానికి స్పందన బాగుంది’’ అని పుర్వార్‌ తెలిపారు. 70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది.  కేంద్రం అందిస్తున్న  పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ప్రకటించింది.  నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్‌ఎల్‌ ఇప్పటికే తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది. You may be interested

అటోకు మొబైల్స్‌కు పండుగ

Tuesday 12th November 2019

అక్టోబర్‌లో కార్ల విక్రయాల్లో స్వల్ప వృద్ధి 11 నెలల క్షీణతకు బ్రేక్‌ కలిసొచ్చిన కొత్త మోడల్స్‌ న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ సందర్భంగా మెరుగుపడిన సెంటిమెంటు, కొత్త మోడల్స్‌ ఊతంతో అక్టోబర్‌లో ప్యాసింజర్‌ వాహనాల విభాగం కాస్త ఊపిరి పీల్చుకుంది. గత నెల అమ్మకాల్లో స్వల్ప వృద్ధి నమోదు చేసింది. దీంతో వరుసగా 11 నెలల క్షీణతకు బ్రేక్‌ పడినట్లయింది. ఆటోమొబైల్‌ సంస్థల సమాఖ్య సియామ్‌ సోమవారం ఈ విషయాలు వెల్లడించింది. సియామ్‌ గణాంకాల ప్రకారం

అదానీ పోర్ట్స్‌ సెజ్‌ లాభం 72 శాతం

Tuesday 12th November 2019

రూ.1,059 కోట్లకు పెరిగిన నికర లాభం  కార్గో, కంటైనర్‌ విభాగాల్లో పెరుగుతున్న మార్కెట్‌ వాటా  న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఏపీసెజ్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 72 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.614 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,059 కోట్లకు పెరిగిందని ఏపీసెజ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,922 కోట్ల నుంచి రూ.3,327 కోట్లకు పెరిగిందని

Most from this category