News


భారత్‌ నుంచి రెట్టింపు కొనుగోళ్లు: బోయింగ్‌

Saturday 14th March 2020
news_main1584159406.png-32475

  • త్వరలో 2 బిలియన్‌ డాలర్లకు సోర్సింగ్‌
  • బోయింగ్‌ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత సరఫరాదారుల నుంచి కొనుగోళ్లను మరికొన్నాళ్లలో 2 బిలియన్‌ డాలర్లకు పెంచుకోనున్నట్లు విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ కమర్షియల్‌ ఎయిర్‌ప్లేన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డరెన్‌ హస్ట్‌ తెలిపారు. ప్రస్తుతం ఇది ఏటా 1 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. భారత్‌లోని 200 మంది పైగా సరఫరాదారులు బోయింగ్‌కు చెందిన అత్యాధునిక ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాలు అందిస్తున్నారని హస్ట్‌ వివరించారు. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 2040 నాటికి భారత్‌ ఎయిర్‌లైన్స్‌కి కొత్తగా 2,500 పైచిలుకు విమానాలు అవసరమవుతాయన్న అంచనాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్‌లోనే విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్‌ కార్యకలపాలు అందుబాటులోకి తెచ్చేలా పౌర విమానయాన శాఖతో సంప్రతింపులు జరుపుతున్నట్లు హస్ట్‌ పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ వింగ్స్‌ 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.

ఏవియేషన్‌కు కరోనా దెబ్బ...
కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా చైనా, ఇతర ఆసియా పసిఫిక్‌ దేశాల్లో ఫ్లయిట్‌ సర్వీసులు దాదాపు సగంపైగా తగ్గిపోయాయని డరెన్‌ చెప్పారు. సాధారణంగా చైనా నుంచి రోజుకు సగటున 15,000 పైచిలుకు సర్వీసులు ఉండేవని.. కరోనా తాకిడికి ఈ సంఖ్య 3,000 స్థాయికి కూడా పడిపోయిందన్నారు. భారత్‌లో దీని ప్రభావం పెద్దగా లేదన్నారు. కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావాలు మరో రెండు త్రైమాసికాల దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని డరెన్‌ చెప్పారు. 



You may be interested

యూఎస్‌లో ఎమర్జెన్సీ- స్టాక్స్‌ రికార్డ్‌

Saturday 14th March 2020

10 శాతం దూసుకెళ్లిన డోజోన్స్‌ మార్కెట్‌ చరిత్రలో కొత్త రికార్డ్‌ 2008 తదుపరి అతిపెద్ద ర్యాలీ గత వారం నికరంగా భారీ నష్టాలు ఇండియన్‌ ఏడీఆర్‌లు జూమ్‌ వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా హైజంప్‌ చేశాయి. కోవిడ్‌-19 విస్తృతిని అడ్డుకోవడం కోసం ప్రెసిడెంట్‌ ట్రంప్‌ జాతీయ అత్యయిక పరిస్థితి(నేషనల్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు డ్రమటిక్‌గా కోలుకున్నాయి. రెండు రోజుల భారీ పతనాల నుంచి బయటపడిన మార్కెట్లు రివ్వున పైకెగశాయి. డోజోన్స్‌ 1985

ఆరు నెలల క్షీణతకు తెర!

Saturday 14th March 2020

ఫిబ్రవరి ఎగుమతుల్లో 2.91 శాతం వృద్ధి దిగుమతులూ వృద్ధిబాటలోకి...  వాణిజ్యలోటు 9.85 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు ఆరు నెలల తర్వాత ఫిబ్రవరిలో 2.91 శాతం స్వల్ప వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. అంటే 2019 ఫిబ్రవరితో పోల్చితే 2020 ఫిబ్రవరిలో ఎగుమతులు 2.91 శాతం పెరిగాయన్నమాట. విలువ రూపంలో 27.65 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్‌, కెమికల్స్‌ వంటి రంగాల ఎగుమతుల్లో వృద్ధి నమోదుకావడం దీనికి కారణం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తాజా

Most from this category