News


‘ఎయిర్‌ట్రాఫిక్‌’పై ఏఏఐ, బోయింగ్‌ జట్టు

Wednesday 5th June 2019
news_main1559729527.png-26110

  • పదేళ్ల రోడ్‌మ్యాప్‌ కోసం కుదిరిన ఒప్పందం
  • ఏడాదిన్నరలో సిద్ధం కానున్న రోడ్‌మ్యాప్‌

న్యూఢిల్లీ: భారత్‌లో విమానాల నిర్వహణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో (ఏఏఐ) కలిసి పదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు వైమానిక దిగ్గజం బోయింగ్‌ తెలియజేసింది. ఈ రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు తాము సాంకేతిక సహకారం అందించేలా ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక 18 నెలల్లో సిద్ధం కావచ్చని, అమెరికా ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (యూఎస్‌టీడీఏ) నిధులతో దీన్ని చేపట్టనున్నామని సంస్థ తెలియజేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏఏఐ నేతృత్వంలో 125 విమానాశ్రయాలను కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా, స్థానికంగా ఉన్న అత్యుత్తమ ప్రమాణాలకు లోబడి జాతీయ ఎయిర్‌స్పేస్‌ వ్యవస్థను ఆధునికీకరించడానికి ఈ రోడ్‌మ్యాప్‌ మార్గదర్శకత్వం వహిస్తుంది. ఎయిర్‌స్పేస్ సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకునేలా, కమ్యూనికేషన్స్‌ను పెంచడం, నిఘా, విమానాల రద్దీ నియంత్రణ విషయాల్లోనూ ఈ రోడ్‌మ్యాప్‌ ఉపకరిస్తుందని బోయింగ్‌ పేర్కొంది. ఈ  విషయంలో డీజీసీఏతోనూ కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆధునిక టెక్నాలజీలు, అంతర్జాతీయ విధానాలను అమలు చేయడం ద్వారా భారత్‌ తన గగనతల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోగలదని ఏఏఐ చైర్మన్‌ గురుప్రసాద్‌ మొహపాత్రా పేర్కొన్నారు. You may be interested

రుణాలకు పెరుగుతున్న డిమాండ్‌

Wednesday 5th June 2019

ఈ ఏడాది 10-12 శాతం వృద్ధి రికవరీ అవకాశాలు మెరుగు వార్షిక నివేదికలో ఎస్‌బీఐ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ​ ఇండియా (ఎస్‌బీఐ) స్పష్టంచేసింది. రుణాలకు తిరిగి డిమాండ్‌ ఏర్పడుతుండడం, రుణాల వసూళ్ల అవకాశాలు మెరుగుపడడంతో ఈ లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. బలమైన వ్యాపార వృద్ధితోపాటు తగినంత మూలధనం, లిక్విడిటీ, మార్కెట్‌ లీడర్‌గా

మరింతగా అప్పుల ‘చమురు’!

Wednesday 5th June 2019

భారీ రుణ భారంలో చమురు మార్కెటింగ్‌ సంస్థలు మార్చినాటికి ఏకంగా రూ.1.62 లక్షల కోట్ల రుణాలు భారీ మూలధన వ్యయాలతో పెరిగిన రుణాలు ప్రభుత్వం సబ్సిడీలు చెల్లించకపోవటంతో ఇంకాస్త... న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) రుణాలపై ఆధారపడడం రానురాను మరింత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌నే (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ఉమ్మడి రుణాలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడింటి

Most from this category