News


వినయశీలి, మృదుభాషి: సిద్ధార్థకు కార్పొరేట్ల నివాళులు

Thursday 1st August 2019
news_main1564630288.png-27455

వీజీ సిద్ధార్థ మృతిపై పరిశ్రమ దిగ్గజాలు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సిద్ధార్థ వినయశీలి, మృదుభాషి’’ అని బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్‌ షా, ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు నివాళులర్పించారు. "సిద్ధార్థ భార్య మాళవిక, ఆయన కుమారులు, ఎస్‌ఎం కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాను" అని కిరణ్ మజుందార్‌ షా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో పేర్కొన్నారు. "సిద్ధార్థ గొప్ప మనిషి, చురుకైన వ్యాపారవేత్త. ఆయన లేఖలో పేర్కొన్న విషయాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి" అని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ప్రమోటరు విజయ్ మాల్యా పేర్కొన్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎలాంటివారినైనా దైన్య స్థితిలోకి నెట్టేయగలవని వ్యాఖ్యానించారు. "ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు ఎవరినైనా సరే తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేయగలవు. పూర్తిగా రుణాలన్నీ కట్టేస్తానంటున్నా నాతో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి" అంటూ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. మరోవైపు, వ్యాపార వైఫల్యాలతో ఔత్సాహిక వ్యాపారవేత్తలు కుంగిపోరాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. "సిద్ధార్థ స్ఫూర్తిదాయకమైన ఎంట్రప్రెన్యూర్‌, ఇన్వెస్టరు" అని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ పేర్కొన్నారు. 

ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకి నిదర్శనం: మాల్యా
సిద్ధార్థ మర౾౾ణంపై దివాలా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు విజయ్‌ మాల్యా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు ఇదో నిదర్శనమని వ్యాఖ్యానించారు. రుణాలన్నీ తిరిగి పూర్తిగా కట్టేస్తానంటున్నా తనను కూడా అలాగే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకులకు ఎగవేసిన ఆర్థిక నేరస్థుడన్న ఆరోపణలతో మాల్యా ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. "నాకు వీజీ సిద్ధార్థతో పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఆయన మంచి వ్యక్తి. చురుకైన వ్యాపారవేత్త. ఆయన లేఖలోని అంశాలు ఎంతో కలిచివేసేవిగా ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎలాంటివారినైనా దయనీయ స్థితిలోకి నెట్టేయగలవు. నేను పూర్తిగా డబ్బు కట్టేస్తానంటున్నా ఎలా వేధిస్తున్నారో కనిపిస్తూనే ఉంది. మిగతా దేశాల్లో రుణగ్రహీతలు ఏదో రకంగా రుణాలు కట్టేసేలా ప్రభుత్వం, బ్యాంకులు సహాయం అందిస్తాయి. కానీ నా కేసు విషయంలో నేను కట్టేసేందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటున్నారు" అని మాల్యా వ్యాఖ్యానించారు.

కాఫీ డే సంస్థల్లో ఫండ్స్‌ పెట్టుబడులు రూ. 193 కోట్లు..
సిద్ధార్థకు చెందిన కాఫీ డే నేచురల్ రిసోర్సెస్‌, టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 193 కోట్ల పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కాఫీ డే నేచురల్ రిసోర్సెస్‌లో ఫండ్స్ పెట్టుబడులు రూ. 149 కోట్లు, టాంగ్లిన్‌లో రూ. 44 కోట్ల మేర ఉన్నట్లు ఆర్థిక రంగ సమాచార సంస్థ మార్నింగ్‌స్టార్‌ రూపొందించిన నివేదికలో వెల్లడైంది. ఇందులో డీఎస్‌పీ క్రెడిట్ రిస్క్ ఫండ్ అత్యధికంగా కాఫీ డే నేచురల్ రిసోర్సెస్‌లో రూ. 132 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. You may be interested

సీసీడీ తాత్కాలిక చైర్మన్‌గా రంగనాథ్‌

Thursday 1st August 2019

తాత్కాలిక సీవోవోగా నితిన్‌ కాఫీ డే ఎ౾ంటర్‌ప్రైజెస్ బోర్డు నిర్ణయాలు న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ (సీసీడీ) వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మరణం నేపథ్యంలో తాత్కాలిక చైర్మన్‌గా స్వతంత్ర డైరెక్టర్ ఎస్‌వీ రంగనాథ్‌ నియమితులయ్యారు. నితిన్ బాగ్మానే తాత్కాలిక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ (సీవోవో)గా నియమితులయ్యారు. సిద్ధార్థ భార్య మాళవిక హెగ్డే డైరెక్టరుగా ఉన్న సీసీడీ బోర్డు బుధవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రంగనాథ్‌, నితిన్ బాగ్మానే, సీఎఫ్‌వో ఆర్‌

జీ డీల్‌కు ఇన్వెస్కో సై

Thursday 1st August 2019

మరిన్ని పెట్టుబడులకు ఇన్వెస్కో అంగీకారం మరో 11 శాతం వాటాల కొనుగోలు డీల్ విలువ రూ. 4,224 కోట్లు ఇప్పటికే 7.74 శాతం వాటా ముంబై: నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీ గ్రూప్‌నకు ఊరటనిచ్చేలా అమెరికాకు చెందిన ఇన్వెస్కో ఓపెన్‌హైమర్ ఫండ్ మరింత ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎ౾ంటర్‌ప్రైజెస్ (జీ)లో ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ డీల్‌ విలువ రూ. 4,224 కోట్లుగా ఉండనుంది.

Most from this category