News


ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు సత్యం తరహా పరిష్కారం?

Monday 1st October 2018
news_main1538386986.png-20758

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను ఒడ్డునపడేసేందుకు సత్యం కంప్యూటర్స్‌ తరహా పరిష్కారాన్ని తెచ్చేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గ్రూప్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేసేందుకు ఎన్‌సీఎల్‌టీని అనుమతి కోరింది. సోమవారమే ఇందుకు సంబంధించి ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయి. సంక్షోభానికి సరైన మేనేజ్‌మెంట్‌ చర్యలు లేకపోవడం కూడా ఒక కారణమని కేంద్రం తన పిటీషన్‌లో పేర్కొంది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ పతనమైతే అది అటు ఎంఎఫ్‌లు, ఇటు ఎకానమీపై నెగిటివ్‌ ప్రభావం చూపగలదని ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల యాజమాన్య మార్పిడికి అవకాశం ఇవ్వాలని కోరింది. మరోవైపు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సైతం కేంద్ర పిటీషన్‌కు మద్దతు తెలిపింది. కేంద్రం తీసుకునే చర్యలు తమను గట్టెక్కిస్తాయని ఆశగా ఉంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేలా ఒక సరైన పరిష్కారం లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. 
చైర్మన్‌గా ఉదయ్‌ కోటక్‌?
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ బోర్డుకు ఉదయ్‌ కోటక్‌ను నియమించాలని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ భావిస్తున్నట్లు సమాచారం. కొత్త బోర్డులో పదిమంది వరకు సభ్యులుండే అవకాశం ఉంది. 2009లో సత్యం కుంభకోణం సమయంలో కూడా ప్రభుత్వం జోక్యం కల్పించుకొని అటు ఇన్వెస్టర్లు ఇటు వాటాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు యత్నించింది. ఆ సమయంలో ప్రభుత్వం సత్యం బోర్డులోకి దీపక్‌ పరేఖ్‌, కిరణ్‌ కర్నిక్‌, అచ్యుతన్‌ లాంటి దిగ్గజాలను నియమించి పరిస్థితిని చక్కదిద్దింది. ఇప్పుడు తాజా సంక్షోభంలో ఇదే సూత్రం ఫాలో అయ్యేందుకు కేంద్రం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ నెత్తిన దాదాపు 91వేల కోట్ల రూపాయల రుణభారం ఉంది. You may be interested

ఎన్‌బీఎఫ్‌సీల్లో ఫండ్స్‌ పెట్టుబడులు.. ఏం పర్వాలేదు..

Monday 1st October 2018

ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల గురించి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు వ్యాల్యురీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. లిక్విడిటీ సమస్య అనేది ఒక అంశమైతే.. విశ్వాసాన్ని ఏర్పరచడం అనేది మరొక అంశమని తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వంటి ఘటనలు తలెత్తినప్పుడు.. దీని వల్ల ఇతర విభాగాలపై కూడా నెగటివ్‌ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అందువల్ల సవాళ్లను అధిగమించేందుకు త్వరితగతిన చర్యలను

మిశ్రమంగా అటో అ‍మ్మకాలు

Monday 1st October 2018

వాహన విక్రయాలు సెప్టెంబర్‌లో  మిశ్రమంగా నమోదయ్యాయి. ప్యాసింజర్‌ వాహన విక్రయాలకు డిమాండ్‌ లేకపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, అటో పరిశ్రమపై కేరళ వరదల ప్రభావం ఇప్పటికీ తగ్గకపోవడం, దేశంలో పలు ప్రాంతాల్లో వర్షభావ ప్రభావం తక్కువగా నమోదుకావడం తదితర కారణాలు సెప్టెంబర్‌ వాహన విక్రయాలపై ప్రభావాన్ని చూపాయి. ఈ నెలలో (అక్టోబర్‌) పండుగ సీజన్‌ సందర్భంగా తిరిగి అటో విక్రయాలు పుంజుకుంటాయనే ఆశాభావాన్ని పలు కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మారుతి

Most from this category