News


రీరేటింగ్‌ దిశగా టెల్కోలు

Thursday 10th October 2019
news_main1570704884.png-28809

చార్జీల పెంపు పాజిటివ్‌ అంటున్న బ్రోకరేజ్‌లు
రిలయన్స్‌ జియో తాజాగా ఐయూసీ చార్జీలను సాకుగా చూపి అవుట్‌గోయింగ్‌ చార్జీలను(ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై) వసూలు చేయాలని నిర్ణయించింది. ఇది కంపెనీ ఆదాయం, ఎబిటాలను ప్రోత్సాహమిచ్చే పాజిటివ్‌ చర్యని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి. ఇదే బాటలో ఇతర కంపెనీలు కూడా పయనిస్తాయని అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే 2021 ఆర్థిక సంవత్సరానికి టెల్కోల ఎబిటా దాదాపు 16- 17 శాతం మేర పెరగవచ్చని యాక్సిస్‌ క్యాపిటల్‌ అంచనా వేసింది. ఆర్‌జియో తీసుకున్న చర్య అతి పోటీ కారణంగా కూనారిల్లుతున్న టెలికం పరిశ్రమలో పెద్ద పాజిటివ్‌ ముందడుగని వ్యాఖ్యానించింది. సమీప భవిష్యత్‌లో టెలికం కంపెనీల రీరేటింగ్‌కు ఇది ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని అభిప్రాయపడింది. ఈ చార్జీలతో అర్పు(ఏఆర్‌పీయూ)లో గణనీయ మార్పులొస్తాయని పేర్కొంది. ఐయూసీ చార్జీలను ఎత్తివేయకూడదని ట్రాయ్‌ నిర్ణయిస్తే జియో ఎబిటా క్రమంగా 40 శాతం మేర పెరుగుతుందని మరో ప్రముఖ బ్రోకింగ్‌సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. జియో తీసుకున్న నిర్ణయం ట్రాయ్‌ను ఐయూసీ చార్జీలు ఎత్తివేసేలా ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడింది. సిటీ గ్రూప్‌ సైతం ఈ చార్జీలతో టెల్కోల పద్దు పుస్తకాలు పాజిటివ్‌గా మారతాయని అభిప్రాయపడింది. ఒక్క జియో ఎబిటానే 30 శాతం మేర దూసుకుపోవచ్చని అంచనా వేసింది. అయితే చార్జీల కొనసాగింపుపై ట్రాయ్‌ నిర్ణయం కీలకం కానుందని తెలిపింది. చార్జీలు కొనసాగిస్తే అన్నింటి కన్నా వొడాఫోన్‌ ఐడియాకు ఎక్కువ లాభదాయకమని, ఈ కంపెనీ ఎబిటా 50 శాతం మేర పెరగవచ్చని అంచనా వేసింది. నోమురా  కూడా ఇదే అంచనాలు వెలిబుచ్చింది. ఈ చార్జీలు కంపెనీల ఏఆర్‌పీయూ క్రమానుగత పెరుగుదలకు దోహదం చేస్తాయని అంచనా వేసింది. అయితే జెఫర్రీస్‌ మాత్రం ఈ చర్యతో జియో మినహా ఇతర కంపెనీలకు ఎంత ప్రయోజనం ఉండొచ్చనే అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించింది. కంపెనీల మధ్య పోటీ ఇంకా పెరగవచ్చని తెలిపింది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ఐడియా అవుట్‌లుక్‌పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎడెల్‌వీజ్‌ ప్రకారం తాజా చర్య కంపెనీ ఎబిటాను 10 శాతం మేర పెంచుతుంది. జియో నిర్ణయం మొత్తం పరిశ్రమకు పాజిటివ్‌ ఫలితాలు ఇస్తుందని వ్యాఖ్యానించింది.  



You may be interested

నిఫ్టీకి 11,250 కీలకం.. దిగువన మరింత బలహీనత

Thursday 10th October 2019

నిఫ్టీ-50 11,300 స్థాయి నుంచి గురువారం 11,200 స్థాయి దిశగా పడిపోయింది. రోజంతా ఎక్కువగా అమ్మకాలు ఒత్తిడిని సూచీలు ఎదుర్కొన్నాయి. 200 రోజుల డీఎంఏ 11,250పైన నిలదొక్కుకుంటేనే 11,333, 11400 దిశగా నిఫ్టీ పెరిగేందుకు అవకాశం ఉంటుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా తెలిపారు. నిఫ్టీకి 11,100 మద్దతు స్థాయిగా వ్యవహరిస్తుందన్నారు. బుధవారం 11,300పైన క్లోజ్‌ అయినా కానీ, కొనసాగింపుగా కొనుగోళ్ల మద్దతు తర్వాతి

నిరాశపరిచిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

Thursday 10th October 2019

లాభంతో పాటు ప్రొవిజన్స్‌లో కూడా పెరుగుదల సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఇండస్‌ఇండ్‌బ్యాంకు నికరలాభం గతేడాదితో పోలిస్తే 50 శాతం పెరిగి రూ. 1384 కోట్లకు చేరింది. అయితే అనలిస్టులు సరాసరిన నికరలాభంలో 55- 60 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో బ్యాంకు ఎన్‌ఐఐ 32 శాతం వృద్దితో రూ. 2909 కోట్లకు చేరింది. ఇతరాదాయాలు 31 శాతం పెరిగి రూ. 1727 కోట్లను చేరాయి. నికర వడ్డీ ఆదాయంలో

Most from this category